Telangana all party MP meeting: రేవంత్ మాస్టర్ ప్లాన్... కేంద్ర మంత్రులకు భట్టి ఫోన్
ABN , Publish Date - Mar 07 , 2025 | 04:43 PM
Telangana all party MP meeting: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన ఆల్ పార్టీ ఎంపీల సమావేశం జరుగనుంది. ఈ సమావేశానికి ప్రధానంగా కేంద్రమంత్రులకు ఆహ్వానం పంపారు.

హైదరాబాద్, మార్చి 7: ప్రజాభవన్‌లో రేపు (శనివారం) ఆల్ పార్టీ ఎంపీల సమావేశం (Telangana all party MP meeting) జరుగనుంది. కేంద్రంలో పెండింగ్ సమస్యల పరిష్కారం ఎంజెడాగా ఈ సమావేశం జరుగనుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) అధ్యక్షతన ఉదయం 11 గంటలకు ప్రజాభవన్‌లో సమావేశం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ముఖ్యఅతిధిగా హాజరుకానున్నారు. అలాగే కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లకు ఆహ్వానం పంపారు. తెలంగాణ ఎంపీలందరికీ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫోన్ చేసి ఆహ్వానించారు.
ఆల్ పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని నిన్న(గురువారం) జరిగిన కేబినెట్ సమావేశంలోనే నిర్ణయించారు. జానారెడ్డి, భట్టి విక్రమార్క నేతృత్వంలో కమిటీని వేసి ఆల్ పార్టీ సమావేశాన్ని నిర్వహించి రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన వాటాలు, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై అఖిలపక్షంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా నిన్న కేబినెట్‌లో తీర్మానం చేయడంతో పాటు భట్టి, జానా నేతృత్వంలో కమిటీని కూడా వేసింది. వెంటనే రంగంలోకి దిగిన కమిటీ.. స్వయంగా అన్ని పార్టీలకు సంబంధించిన ఎంపీలకు భట్టి ఫోన్‌లు చేసి సమావేశానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. రేపు ఉదయం 11 గంటలకు ప్రజాభవన్‌లో ఆల్ పార్టీ ఎంపీల సమావేశం నిర్వహించనున్నారు. భట్టి, జానారెడ్డి నేతృత్వంలో జరుగనున్న ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరుకానున్నారు. బీజేపీకి సంబంధించిన ఎంపీలను కూడా సమావేశానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. అందులో ప్రధానంగా కేంద్ర మంత్రులుగా ఉన్న బండి సంజయ్, కిషన్ రెడ్డిలకు కూడా ఆహ్వానాన్ని పంపారు. స్వయంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫోన్ చేసి వారిని సమావేశానికి రావాల్సిందిగా ఆహ్వానించారు.
ప్రధానంగా స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ కల్పించాలనే ఆలోచనలో తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఉంది. అందుకు సంబంధించిన ముసాయిదా బిల్లును కూడా సిద్ధం చేసింది. డ్రాఫ్ట్ బిల్లును కూడా సిద్ధం చేయడంతో పాటు నిన్న కేబినెట్ భేటీలో ఆమోద ముద్ర కూడా పడింది. ఈనెల 12 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో ఆ బిల్లుకు ఆమోదం తెలిపి కేంద్రానికి పంపించి షెడ్యూల్ 9కి మార్పు చేసి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ పెంచుకునే అవకాశం కల్పించాలని కేంద్రాన్ని ప్రభుత్వం కోరనుంది. అందులో భాగంగా కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు అన్ని పార్టీలు తమతో కలిసి రావాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది. ఈ నేపథ్యంలో ఆల్ పార్టీ ఎంపీల సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అన్ని పార్టీలతో చర్చించి ఢిల్లీ స్థాయిలో తాము చేయబోయే పోరాటానికి అందరూ కలిసి రావాలని వినతి చేయనున్నారు.
ఇవి కూడా చదవండి...
Teacher Beats Students: ప్రభుత్వ పాఠశాలలో దారుణం.. బయటపడ్డ పీఈటీ అరాచకం
phone tapping case twist: ఫోన్ ట్యాపింగ్ కేసులో ట్విస్ట్
Read Latest Telangana News And Telugu News