Share News

BV Raghavulu: కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ ట్రాప్‌లో పడింది..

ABN , Publish Date - Oct 13 , 2025 | 01:00 PM

కేంద్ర ప్రభుత్వం తీసుకోచ్చిన ఈ విధానం ద్వారా అదానీ కంపెనీలకు అధిక లాభం కలగనుందని బీవీ రాఘవులు ఆరోపించారు. విద్యుత్ పంపిణీ సంస్థలను ప్రైవేటీకరణించే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు.

BV Raghavulu: కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ ట్రాప్‌లో పడింది..
BV Raghavulu

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వంపై సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు విమర్శలు గుప్పించారు. విద్యుత్ చట్ట సవరణ ప్రతిపానను కేంద్ర ప్రభుత్వం ఈ నెల 9న చేసిందని తెలిపారు. దీనిపై నెల రోజుల పాటు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనుందని పేర్కొన్నారు. గతం కంటే దుర్మార్గమైన అంశాలు ఇందులో ఉన్నాయని ఆరోపించారు. వినియోగదారుల, విద్యుత్ పంపిణీ సంస్థల ప్రమేయం లేకుండా కేంద్రం చట్టం చేయబోతుందని చెప్పారు. బొగ్గు గనులను కార్పోరేట్ పరం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రైవేటు కార్పోరేట్ సంస్థలకు, విద్యుత్ ఉత్పత్తి సంస్థల లాభాల కోసం కేంద్రం ఇలా చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.


కేంద్ర ప్రభుత్వం తీసుకోచ్చిన ఈ విధానం ద్వారా అదానీ కంపెనీలకు అధిక లాభం కలగనుందని బీవీ రాఘవులు ఆరోపించారు. విద్యుత్ పంపిణీ సంస్థలను ప్రైవేటీకరించే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. దీని ద్వారా రైతాంగానికి, ఉచిత గృహ విద్యుత్ పొందుతున్న వారందరికీ తీవ్ర నష్టం జరుగుతుందని తెలిపారు. విద్యుత్ రంగాన్ని ప్రైవేటు పరం చేయడం.. అదానీ కంపెనీలకు మేలు చేసేందుకు చేసిందే అని విమర్శించారు. జూలై 25న సీఎం రేవంత్ రెడ్డి ఒక ప్రకటన చేశారని గుర్తుచేశారు. మూడవ విద్యుత్ పంపిణీ సంస్థ ఏర్పాటు చేస్తామని అన్నారని చెప్పారు.


కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీజేపీ ట్రాప్‌లో పడిందని బీవీ రాఘవులు తెలిపారు. విద్యుత్ కూడా ఒక మౌళిక సదుపాయమని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలు వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని చెప్పారు. భారత్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కక్షసాధింపు చర్యలకు పాల్పడితే.. ఎందుకు మోదీ నిశ్శబ్దంగా ఉన్నారని ప్రశ్నించారు. దేశంలో వ్యవసాయ రంగాన్ని రక్షించకపోతే ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు హెచ్చరించారు.


ఇవి కూడా చదవండి..

Central Govt: పాఠశాలల్లో యూపీఐతో ఫీజుల వసూలు

Dalit IPS Officer: ఐపీఎస్‌ అధికారి ఆత్మహత్యలో కొత్తగా అట్రాసిటీ సెక్షన్‌

Updated Date - Oct 13 , 2025 | 01:21 PM