Share News

CM Revanth Reddy: సీజేఐ గవాయ్‌పై దాడికి యత్నం.. చీకటి రోజుగా అభివర్ణించిన రేవంత్..

ABN , Publish Date - Oct 06 , 2025 | 04:54 PM

సుప్రీంకోర్టులో ఓ కేసు విచారణ సమయంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ గవాయ్‌పై దాడి చేసేందుకు ఓ లాయర్ యత్నించాడు. కేసు విచారణలో భాగంగా వాదనలు జరుగుతుండగా ఓ న్యాయవాది సీజేఐపైకి బూటు విసిరేందుకు యత్నించాడు.

CM Revanth Reddy: సీజేఐ గవాయ్‌పై దాడికి యత్నం.. చీకటి రోజుగా అభివర్ణించిన రేవంత్..
CM Revanth Reddy

హైదరాబాద్: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సీజేఐ గవాయ్‌పై జరిగిన దాడి యత్నాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఖండించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా రేవంత్ ట్వీట్ చేశారు. దేశ న్యాయవ్యవస్థలోని అత్యున్నత అధికారిపై దాడి చేసి బెదిరించడానికి జరిగిన దుర్మార్గపు ప్రయత్నాన్ని తాను మాటల్లో ఖండించలేనని చెప్పారు. ఇది మన దేశ చరిత్రలో చీకటి రోజు అని ముఖ్యమంత్రి అభివర్ణించారు. ఇటువంటి పిరికి దాడులకు తాను భయపడబోనని ధైర్యంగా ప్రకటించిన ధైర్యవంతుడైన ప్రధాన న్యాయమూర్తి బి.ఆర్.గవాయ్ కి దేశ పౌరులతో కలిసి తాను సంఘీభావం ప్రకటిస్తున్నట్లు రాసుకొచ్చారు..


సుప్రీంకోర్టులో ఓ కేసు విచారణ సమయంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ గవాయ్‌పై దాడి చేసేందుకు ఓ లాయర్ యత్నించాడు. కేసు విచారణలో భాగంగా వాదనలు జరుగుతుండగా ఓ న్యాయవాది సీజేఐపైకి బూటు విసిరేందుకు యత్నించాడు. గమనించిన భద్రతా సిబ్బంది వెంటనే అతడిని అడ్డుకున్నారు. దీనిపై స్పందించిన జస్టిస్‌ గవాయ్‌.. ఇలాంటి ఘ‌ట‌న‌లు త‌నను ప్రభావితం చేయ‌లేవ‌ని, తాను చ‌లించ‌డం లేద‌ని, ఎవ‌రూ ఆందోళనకు గురికావొద్దని వ్యాఖ్యానించారు. అనంతరం కోర్టులో ఉన్న లాయ‌ర్లను త‌మ వాద‌న‌లు కొన‌సాగించ‌మ‌ని జస్టిస్‌ గవాయ్‌ కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి...

ఏపీలో భారీ అగ్ని ప్రమాదం.. ఏమైందంటే..

వాయుగుండం ఎఫెక్ట్.. ఏపీలో భారీ వర్షాలు

Updated Date - Oct 06 , 2025 | 05:40 PM