BJP Leader Missing: జూబ్లీహిల్స్‌లో బీజేపీ నేత అదృశ్యం..
ABN , Publish Date - Oct 20 , 2025 | 08:45 AM
బీజేపీ నేత బి.హనుమంతు అదృశ్యం అయినట్లు తన మొదటి భార్య కుమారుడు దత్తు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు రెండు రోజుల క్రితం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లో ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి, బీజేపీ నేత బి.హనుమంతు అదృశ్యం అయినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. రెండో భార్య ఇంట్లో నుంచి తన తండ్రి మాయం అయ్యాడని మొదటి భార్య కొడుకు పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం. ఇద్దరు భార్యల తర్వాత మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు గతంలో హనుమంతుపై ఆరోపణలు వెల్లవెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నెలరోజుల క్రితం జూబ్లీహిల్స్‌లోని హనుమంతు ఇంటివద్ద ఆ మహిళ న్యూసెన్స్ చేసినట్లు తెలుస్తోంది.
ఆ మహిళ న్యూసెన్స్ తరువాత నుంచి బీజేపీ నేత బి.హనుమంతు అదృశ్యం అయినట్లు తన మొదటి భార్య కుమారుడు దత్తు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు రెండు రోజుల క్రితం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. జూబ్లీహిల్స్ రోడ్ నెం.45లో నివాసం ఉంటున్న హనుమంతు నగరంలోని పలు ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారిగా సుపరిచితుడు. జూబ్లీహిల్స్ సొసైటీ, ఎమ్మెల్యే కాలనీ సొసైటీలతో పాటు పలు ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో హనుమంతు కొనసాగుతున్నారు. అయితే దత్తు ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి..
Maoist Party Expels Leaders: మల్లోజుల, ఆశన్న విప్లవ ద్రోహులు
JEE Main 2026: జేఈఈ మెయిన్-2026షెడ్యూల్ విడుదల