Siddipet BC Bandh: సిద్దిపేట బీసీ బంద్‌లో పార్టీల కండువా లొల్లి...
ABN , Publish Date - Oct 18 , 2025 | 10:40 AM
సిద్దిపేటలో బీసీ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో కొందరు బీఆర్ఎస్ నాయకులు పార్టీ కండువాలతో నిరసనలో పాల్గొన్నారు.
సిద్దిపేట: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ బంద్ కొనసాగుతోంది. ఈ మేరకు రాష్ట్రమంతా బీసీ సంఘాల నాయకులు.. బస్ స్టాప్, ప్రధాన రహదారుల్లో బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పించాలని డిమాండ్ చేస్తూ.. ఈ బంద్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో సిద్దిపేట జిల్లాలో పార్టీల కండువా విషయంలో రగడ చెలరేగింది. వివరాళ్లోకి వెళ్తే..
సిద్దిపేటలో బీసీ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో కొందరు బీఆర్ఎస్ నాయకులు పార్టీ కండువాలతో నిరసనలో పాల్గొన్నారు. దీంతో ఆగ్రహించిన బీసీ సంఘాల నాయకులు పార్టీ కండువాలు తీసి నల్ల కండువాలు మాత్రమే వేసుకుని నిరసన తెలపాలని డిమాండ్ చేశారు. దీంతో కాంగ్రెస్, బీసీ సంఘాల నాయకులకు బీఆర్ఎస్ నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఐక్యతను చెడగొట్టడానికి బీఆర్ఎస్ కుట్ర చేస్తోందని కాంగ్రెస్, బీజేపీ ఇతర పక్షాలు మండిపడ్డాయి.
అయితే రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాల బంద్ కొనసాగుతోంది. బంద్ నేపథ్యంలో విద్యాసంస్థలు, వాణిజ్య, వ్యాపార సముదాయాలు స్వచ్ఛందంగా మూసివేశారు. అలాగే బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా రవాణా వ్యవస్థ స్తంభించింది. బంద్ కారణంగా ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు బస్సులు బంద్ కావడంతో.. నగరాల్లో ఆటో, క్యాబ్ ధరలకు రెక్కలు వచ్చాయి. కాగా, జీవో 9పై హైకోర్టు ఇచ్చిన స్టేను సవాల్ చేస్తూ.. దాఖలుచేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో ఇవాళ బీసీ సంఘాలు బంద్‌కు పిలునిచ్చిన విషయం తెలిసిందే. ఈ బంద్‌కు రాష్ట్రంలోని అన్ని పార్టీలు మద్దుతు తెలుపుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
ISRO: నవంబరు చివర్లో బ్లూబర్డ్ ప్రయోగం