Notice Issue: పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు

ABN , First Publish Date - 2025-02-04T12:04:15+05:30 IST

Telangana: పార్టీ మారిన ఎమ్మెల్యేలకు తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు ఇచ్చారు. లిఖితపూర్వంగా సమాధానం చెప్పాలంటూ పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకు ఇచ్చిన నోటీసుల్లో పేర్కొంది.

Notice Issue: పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు
Assembly Secretary issues notices

హైదరాబాద్, ఫిబ్రవరి 4: ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ అయ్యాయి. సుప్రీం కోర్టు (Supreme Court) ఆదేశాల మేరకు ఈ నోటీసులు జారీ అయ్యాయి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలకు అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు జారీ చేశారు. పార్టీ ఫిరాయింపులపై లిఖిత పూర్వక సమాధానం చెప్పాలని నోటీసుల్లో పేర్కొన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని సుప్రీంకోర్టును బీఆర్‌ఎస్ ఆశ్రయించిన విషయం తెలిసిందే. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై నాలుగు నెలల్లో చర్యలు తీసుకోవాలని గతంలోనే తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. అయినప్పటికీ ఎలాంటి పురోగతి లేకపోవడంతో బీఆర్‌ఎస్ పార్టీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది.


2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ నుంచి గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరిపై అనర్హత వేటు వేయాలంటూ ఇప్పటికే బీఆర్‌ఎస్‌ పార్టీ హైకోర్టులో పిటిషన్‌ వేసింది. ఎమ్మెల్యేలపై నాలుగు నెలల్లో చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించినప్పటికీ ఈ వ్యవహారం ముందుకు జరగలేదు. దీంతో బీఆర్‌ఎస్ పార్టీ సుప్రీంలో పిటిషన్ వేసింది. మొదట తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని బీఆర్‌ఎస్ పిటిషన్ వేసింది.

Danam Nagender: ఖైరతాబాద్ ఎమ్మెల్యే మరోసారి సంచలన వ్యాఖ్యలు


ఆ తరువాత మరొక ఏడుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించింది బీఆర్‌ఎస్. అయితే వీటన్నింటినీ కలిపి ఒకేసారి విచారణ చేస్తామంటూ.. ఈ కేసు విచారణను సుప్రీం కోర్టు ఈనెల 10కి వాయిదా వేసింది. ఓ వైపు కోర్టులో విచారణ జరుగుతుండగానే.. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌ను కూడా కోరింది బీఆర్‌ఎస్. దీనిపై స్పందించిన స్పీకర్.. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. లిఖితపూర్వకంగా సమాధానాలు చెప్పాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

Producer Dil Raju: కీలక పత్రాలతో ఐటీ ఆఫీస్‌కు దిల్‌రాజు

కుంభమేళాకు ప్రధాని మోదీ.. పవిత్ర స్నానంతోపాటు

Read Latest Telangana News And Telugu News

Updated Date - 2025-02-04T12:59:28+05:30 IST