ROAD Accident: హైదరాబాద్‌లో ఓఆర్‌ఆర్‌పై ఘోర ప్రమాదం..ఏం జరిగిందంటే..
ABN , Publish Date - May 08 , 2025 | 10:43 AM
ROAD Accident in Hyderabad: అతివేగంతో తరచూగా ప్రమాదాలు జరుగుతునే ఉన్నాయి. తాజాగా రాజేంద్రనగర్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్రగాయాలు అయ్యాయి. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
హైదరాబాద్: కేంద్ర, రాష్ట్రా ప్రభుత్వాలు రోడ్డు ప్రమాదాలపై ఎంతగా అవగాహన కల్పిస్తున్న ఏదోక ప్రాంతంలో యాక్సిడెంట్లు జరుగుతునే ఉన్నాయి. ప్రమాదాల్లో కుటుంబ సభ్యులు మృతిచెందుతుండటంతో ఆయా కుటుంబాలు తీవ్రశోకంలో ఉన్నాయి. తాజాగా రాజేంద్రనగర్‌లో జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందగా.. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. రాజేంద్రనగర్ అవుటర్ రింగ్గు రోడ్డుపై టయోటా కారు బీభత్సం సృష్టించింది. హిమాయత్ సాగర్ వద్ద మరో కారు బ్రేక్ డౌన్ అయింది. ఈ కారు టైర్ మారుస్తున్న రికవరీ వ్యాన్ డ్రైవర్‌ను టయోటా కారు వేగంగా వచ్చి ఢీ కొట్టింది.
రికవరీ వ్యాన్ డ్రైవర్ శివ కేశవ అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనలో మరోకరికి తీవ్ర గాయాలుయ్యాయి. ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. టయోటా కారు డ్రైవర్ మితిమీరిన వేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు. హైదరాబాద్ నుంచి ఔటర్ రింగు రోడ్డు మీదుగా శంషాబాద్ వైపునకు బ్రేక్ డౌన్ అయిన కారు వెళ్తుంది. హిమాయత్ సాగర్ ఎగ్జిట్ 17 వద్దకు రాగానే సడన్‌గా ఆ కారు ఆగిపోయింది. వెంటనే ఔటర్ సిబ్బందికి కారు డ్రైవర్ సమాచారం ఇచ్చారు. సంఘటన జరిగిన స్థలానికి రికవరీ వ్యాన్ చేరుకుంది. బ్రేక్ డౌన్ అయిన కారు టైరు మారుస్తుండగా మితిమీరిన వేగంతో టయోటా కారు డ్రైవర్ దూసుకొచ్చాడు. అతివేగంతో టయోటా కారు ఉండటంతో అదుపు కాలేదు. దీంతో రోడ్డు పక్కన టైరు మారుస్తున్న రికవరీ వ్యాన్ డ్రైవర్ శివ కేశవను టయోటో కారు ఢీ కొట్టింది. స్పాట్‌లోనే రికవరీ వ్యాన్ డ్రైవర్ శివకేశవ మృతిచెందాడు. ఈ ప్రమాదంలో మూడు కార్లు నుజ్జునుజ్జు అయ్యాయి. రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి
Special Trains: నల్గొండ, విజయవాడ, ఏలూరు మీదుగా బెర్హంపూర్ మార్గంలో 16 ప్రత్యేక రైళ్లు
Kishan Reddy: ఆపరేషన్ సిందూర్ భారత నిబద్దతకు నిదర్శనం
CM Revanth Reddy: మరీ ఇంత నిర్లక్ష్యమా!
Read Latest Telangana News And Telugu News