BJP: అండగా ఉంటాం.. అభివృద్ధి చేస్తాం..
ABN , Publish Date - Oct 29 , 2025 | 08:40 AM
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ మంగళవారం సాయంత్రం అసెంబ్లీ సెగ్మెంట్‌లో మహాపాదయాత్ర చేపట్టింది. పార్టీ ముఖ్యనేతలు వివిధ డివిజన్లలో పర్యటించి ఓటర్లను నేరుగా కలిశారు.
- జూబ్లీహిల్స్ ప్రజలకు బీజేపీ అగ్రనేతల హామీ
- పార్టీ ఆధ్వర్యంలో మహా పాదయాత్ర
హైదరాబాద్ సిటీ: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ మంగళవారం సాయంత్రం అసెంబ్లీ సెగ్మెంట్‌లో మహాపాదయాత్ర చేపట్టింది. పార్టీ ముఖ్యనేతలు వివిధ డివిజన్లలో పర్యటించి ఓటర్లను నేరుగా కలిశారు. పార్టీ అభ్యర్థి లంకాల దీపక్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తే అండగా ఉంటామని, అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని జూబ్లీహిల్స్ ప్రజలకు హామీ ఇచ్చారు. నియోజకవర్గంలోని 7 డివిజన్ల పరిధిలో దాదాపు 60 ప్రాంతాల్లో పాదయాత్ర నిర్వహించారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు(BJP state president Ramachandra Rao) నేతృత్వంలో ‘మాస్ క్యాంపెయిన్’ నిర్వహించారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి శ్రీనగర్‌కాలనీ, ఎల్లారెడ్డిగూడలో, ఎన్.రామచంద్రరావు ఎర్రగడ్డ డివిజన్‌లో, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ కృష్ణానగర్‌లోని ఏ, బీ బ్లాక్‌లో, బీజేపీ సీనియర్ నాయకుడు మురళీధర్‌రావు రెహ్మత్‌నగర్‌లో, బీజేపీ శాసనసభ పక్ష నాయకుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, డీకే అరుణ మహా పాదయాత్రలో పాల్గొన్నారు.

బీఆర్‌ఎస్, కాంగ్రెస్ లకు ఇప్పటి వరకు అవకాశం కల్పించారని, ఈసారి బీజేపీకి ఓటేయాలని కోరారు. నియోజకవర్గంలో డ్రైనేజీ, మంచినీటి సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రధానంగా గూండాయిజం, కబ్జాలు, రౌడీషీటర్ల నుంచి రక్షణ కల్పిస్తామని పేర్కొన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..
Read Latest Telangana News and National News