Heavy Rains Alert: తెలుగు రాష్ట్రాలకు అలర్ట్.. నేడు భారీ వర్షాలు..
ABN , Publish Date - Oct 24 , 2025 | 09:41 AM
తెలంగాణలోని నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి - భోంగిర్, మెదక్, సిద్దిపేట, రంగారెడ్డి, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్‌నగర్, వనపర్తి, నేడు ఖమ్మం, భద్రాద్రి-కొత్తగూడెం, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
హైదరాబాద్: నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం కారణంగా రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. వర్షాకాలం ఇంకా ముగియలేదని.. మరి కొన్ని రోజులు వానలు కురుస్తాయని హెచ్చరించింది. వాస్తవానికి ఈ సమయానికి వర్షాకాలం ముగిసి శీతాకాలం ప్రారంభం కావాల్సి ఉంది. కానీ ఈ సంవత్సరం మాత్రం అందుకు భిన్నంగా పలు జిల్లాలో ఇప్పటికే.. వానలు కురుస్తున్నాయి.
తెలంగాణలోని నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి - భోంగిర్, మెదక్, సిద్దిపేట, రంగారెడ్డి, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్‌నగర్, వనపర్తి, నేడు ఖమ్మం, భద్రాద్రి-కొత్తగూడెం, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. వివిక్త ప్రదేశాలలో భారీ వర్షాలు కురుస్తాయి పేర్కొంది. అలాగే.. హైదరాబాద్ నగరంలో ఇవాళ(శుక్రవారం) మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. కావున నగర ప్రజలు పనులు ముగించుకుని త్వరితగతిన ఇంటికి చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కర్నూలు జిల్లాలతో పాటు యానాంలో అతి భారీ నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమలోనూ పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోందని పేర్కొంది. ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో ఇప్పటికే మోస్తారు వర్షం కురుస్తున్నట్లు సమాచారం. వర్షాల నేపథ్యంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. ముందస్తు చర్యలకు సిద్ధం కావాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి..
Election Commission: సర్‌కు సన్నాహాలు చేయండి
Chennai: నాన్నే నేరస్తుడని నమ్మించేలా అమ్మను చంపేశాడు