Share News

Heavy rains in Hyderabad: భారీ వర్షం.. జలమయమైన రోడ్లు..

ABN , Publish Date - Sep 17 , 2025 | 06:58 PM

హైదరాబాద్‌ నగరంలో బుధవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఉద్యోగులు ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయంలో ఒక్కసారిగా వర్షం దంచికొట్టడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

Heavy rains in Hyderabad: భారీ వర్షం.. జలమయమైన రోడ్లు..

హైదరాబాద్‌: నగరంలో బుధవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఉద్యోగులు ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయంలో ఒక్కసారిగా వర్షం దంచికొట్టడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నగరంలోని జూబ్లీహిల్స్, ఫిల్మ్‌నగర్, యూసుఫ్‌గూడ, అమీర్‌పేట్, పంజాగుట్ట, మాదాపూర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. వరద నీరు రోడ్లపైకి చేరడంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. మరోవైపు గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అవడంతో వాహనాలు బారులుతీరాయి.


బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడడంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో మరో మూడు, నాలుగు రోజులపాటు వర్షాలు (Heavy rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే పలు జిల్లాల్లో బుధ, గురువారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. అదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ , జగిత్యాల, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. అలాగే మిగిలిన జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్ గిరి, రంగారెడ్డి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.


Also Read:

పేపర్‌తో హ్యాండ్ వాష్ క్రీమ్.. ఇతడి ప్రయోగం మామూలుగా లేదుగా..

ఈవీఎంలపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం

For More Latest News

Updated Date - Sep 17 , 2025 | 07:11 PM