Minister Tummala: జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ గెలుపు ప్రజల ఆకాంక్ష
ABN , Publish Date - Aug 23 , 2025 | 08:19 AM
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం సాధించాలన్నది రాష్ట్ర ప్రజల ఆకాంక్ష అని, దానిని నెరవేర్చేందుకు వ్యూహాత్మకంగా ముందుకు సాగాలని కార్యకర్తలకు మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు దిశానిర్దేశం చేశారు. ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై శుక్రవారం బూత్ లెవల్ కమిటీ సభ్యులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.
- బూత్ లెవల్ కమిటీ సభ్యులతో మంత్రి తుమ్మల
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక(Jubilee Hills by-election)లో కాంగ్రెస్ విజయం సాధించాలన్నది రాష్ట్ర ప్రజల ఆకాంక్ష అని, దానిని నెరవేర్చేందుకు వ్యూహాత్మకంగా ముందుకు సాగాలని కార్యకర్తలకు మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు(Minister Tummala Nageswara Rao) దిశానిర్దేశం చేశారు. ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై శుక్రవారం బూత్ లెవల్ కమిటీ సభ్యులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై రాష్ట్రమంతా దృష్టి సారించిందని, కొత్త, పాత తేడా లేకుండా కార్యకర్తలందరిని కలుపుకొని వెళ్లాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఓటర్లను చైతన్య పరచాలన్నారు. డివిజన్లలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలు సేకరించి, రాబోయే పీఏసీ సమావేశం కోసం సమగ్ర నివేదిక రూపొందించాలని అధికారులను, నేతలను ఆదేశించారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేయాలన్నారు. కార్యకర్తలు ప్రజలతో నిత్యం సంబంధాలు కొనసాగిస్తు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.

ప్రభుత్వం ఎప్పుడూ ప్రజల పక్షాన నిలుస్తుందని, వారి అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేయడానికి సిద్ధంగా ఉందన్నారు. ఉప ఎన్నికలో విజయం సాధించి జూబ్లీహిల్స్ అభివృద్ధికి కొత్త దిశ చూపించాలని తుమ్మల పేర్కొన్నారు. సమావేశంలో రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్‌రెడ్డి, కో-ఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ లిమిటెడ్ చైర్మన్ జంగ రాఘవరెడ్డి, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రొఫెసర్ రియాజ్, మైనార్టీస్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్ల కొత్వాల్ తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. నేటి రేట్స్ ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News and National News