Share News

Hyderabad: జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ జెండా ఎగురవేయాలి..

ABN , Publish Date - Aug 14 , 2025 | 08:27 AM

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ జెండాను ఎగరవేయాలని మాజీ ఎంపీ, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అంజన్‌ కుమార్‌ యాదవ్‌ పిలుపునిచ్చారు. ఎర్రగడ్డ డివిజన్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు కంచర్ల అశోక్‌ కుమార్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో బుధవారం ఎర్రగడ్డలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

Hyderabad: జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ జెండా ఎగురవేయాలి..

హైదరాబాద్: జూబ్లీహిల్స్‌(Jubilee Hills) ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ జెండాను ఎగరవేయాలని మాజీ ఎంపీ, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అంజన్‌ కుమార్‌ యాదవ్‌(Anjan Kumar Yadav) పిలుపునిచ్చారు. ఎర్రగడ్డ డివిజన్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు కంచర్ల అశోక్‌ కుమార్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో బుధవారం ఎర్రగడ్డలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు.


city5.jpg

సమావేశంలో మాజీ కార్పొరేటర్‌ కంజర్ల శ్రీనివాస్‌ యాదవ్‌, కాంగ్రెస్‌ పార్టీ నగర ప్రధాన కార్యదర్శి దూడల రవిగౌడ్‌, సికింద్రాబాద్‌ జిల్లా మైనార్టీ విభాగం చైర్మన్‌ మహ్మద్‌ మోసిన్‌ ఖురేషి, వైస్‌ చైర్మన్‌ మహ్మద్‌ సర్దార్‌, జిల్లా కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎర్ర కృష్ణ కుమార్‌, నాయకులు భిక్షపతి, నర్సింగ్‌రావు, మహ్మద్‌ ఖాజా పాషా పాల్గొన్నారు.


పోటీ చేయాలనే ఆలోచన లేదు...

- సీఏ వేణుగోపాలస్వామి

పంజాగుట్ట: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో ఎవరికి టిక్కెట్‌ ఇచ్చినా పది వేల మెజార్టీతో గెలిపిస్తామని, తనకు పోటీ చేయాలనే ఆలోచన లేదని సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు సీఏ వేణుగోపాలస్వామి తెలిపారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌, బీఆర్‌ఎ్‌స, బీజేపీ మధ్య పోటీఉంటుందని పేర్కొన్నారు.


city5.3.jpg

ఈ వార్తలు కూడా చదవండి..

పాకిస్థాన్‌ బెదిరింపులకు భయపడేది లేదు

బెట్టింగ్‌ యాప్స్‌ కేసులో ఈడీ విచారణకు హాజరైన మంచు లక్ష్మి

Read Latest Telangana News and National News

Updated Date - Aug 14 , 2025 | 08:27 AM