Share News

Adilabad News: వణుకు పుట్టిస్తున్న చలి..

ABN , Publish Date - Dec 06 , 2025 | 08:48 AM

చలిపులి చంపేస్తోంది. గత మూడురోజుల నుంచి చలి విపరీతంగా పెరిగింది. జిల్లాలోని సాత్నాలలో 10.0 డిగ్రీల సెల్సీయస్‌ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ప్రస్తుతం చలి పెరగడంతో ప్రధానంగా చిన్నపిల్లలు, వయసు పెరిగిన వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Adilabad News: వణుకు పుట్టిస్తున్న చలి..

- సాత్నాలలో 10.0 డిగ్రీల సెల్సీయస్‌ కనిష్ఠ ఉష్ణోగ్రత

- మారుమూల గ్రామాలను కమ్మేస్తున్న దట్టమైన పొగమంచు

- రైతులు, వృద్ధులు, చిన్నపిల్లలకు తప్పని తిప్పలు

ఆదిలాబాద్‌: వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులతో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయి చలి తీవ్రత ప్రజలకు వణుకు పుట్టిస్తుంది. ఇప్పుడే చలి తీవ్రత ఇలా ఉంటే.. రాబోయే జనవరి మాసంలో ఎలా ఉండబోతుందోనని జనం బెంబేలెత్తిపోతున్నారు. గత పక్షం రోజులుగా జిల్లా వాతావరణంలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మధ్యాహ్నం ఉష్ణోగత్రలు పెరిగిపోయి రాత్రి వేళల్లో చలి తీవ్రత కనిపిస్తుంది. శుక్రవారం జిల్లా గరిష్ఠ ఉష్ణోగ్రత 28.0 డిగ్రీల సెల్సియస్‌ కాగా కనిష్ఠ ఉష్ణోగ్రత 11.5గా నమోదైంది. ఆదిలాబాద్‌ రూరల్‌ పిప్పల్‌ధరిలో 11.1,


mnc.jpg

తలమడుగులో 11.2, బేల మండలం చప్రాలలో 11.7, మావల మండలంలో 11.8, గాదిగూడలో కారికెలో 12.0, తాంసిలో 12.3, ఇంద్రవెల్లిలో 12.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మారుమూల గిరిజన గ్రామాలను దట్టమైన పొగమంచు కప్పేస్తుంది. ఉదయం 9గంటల వరకు బయటకు వెళ్లేందుకే ప్రజలు భయపడుతున్నారు. సాయంత్రం 5వరకే పనులను ముగించుకుని ఇళ్లలోకి వెళ్లి పోతున్నారు. రాత్రీపగలు అనే తేడా లేకుండా వెచ్చని దుస్తులను ధరిస్తున్నారు. చలి తీవ్రతకు చలి మంటలు వేసుకుంటు వెచ్చదనం పొందుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

గుడ్ న్యూస్.. వెండి ధరలో భారీ కోత

రూ.100తో వారసత్వ భూముల రిజిస్ర్టేషన్‌

Read Latest Telangana News and National News

Updated Date - Dec 06 , 2025 | 08:48 AM