Share News

Raging in School: పుట్టిన రోజు పేరుతో ర్యాగింగ్.. రక్తం కారుతున్నా పట్టించుకోకుండా..

ABN , Publish Date - Sep 17 , 2025 | 07:24 PM

ర్యాగింగ్ చేయడం, తోటి విద్యార్థులను ఇబ్బంది పెట్టడం నేరమని తెలిసినా పోలీసులు పదే పదే హెచ్చిరిస్తున్నా విద్యార్థుల్లో మార్పు రావడం లేదు. తాజాగా, హైదరాబాద్ నగరంలోని ఓ స్కూల్లో పుట్టిన రోజు ర్యాగింగ్‌‌ పేరుతో 9వ తరగతి విద్యార్థిని చిత్రహింసలు పెట్టినట్లు తెలుస్తోంది.

Raging in School: పుట్టిన రోజు పేరుతో ర్యాగింగ్.. రక్తం కారుతున్నా పట్టించుకోకుండా..

హైదరాబాద్: ఇన్నాళ్లూ కాలేజీలకే పరిమితమైన ర్యాగింగ్ భూతం.. ప్రస్తుతం స్కూళ్లలోకి కూడా పాకింది. సీనియర్ విద్యార్థులు జూనియర్లను ర్యాగింగ్ చేయడం సర్వసాధారణమైపోయింది. దీనికితోడు ఇటీవల పుట్టిన రోజు వేడుకల పేరుతోనూ దారుణంగా ప్రవర్తించడం చూస్తున్నాం. ర్యాగింగ్ చేయడం, తోటి విద్యార్థులను ఇబ్బంది పెట్టడం నేరమని తెలిసినా పోలీసులు పదే పదే హెచ్చిరిస్తున్నా విద్యార్థుల్లో మార్పు రావడం లేదు. తాజాగా, హైదరాబాద్ నగరంలోని ఓ స్కూల్లో పుట్టిన రోజు ర్యాగింగ్‌‌ పేరుతో 9వ తరగతి విద్యార్థిని చిత్రహింసలు పెట్టినట్లు తెలుస్తోంది.


నగరంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలిసింది. పోలీసులు, బాధిత విద్యార్థి కుటుంబసభ్యుల సమాచారం మేరకు.. రిషాంత్ రెడ్డి అనే విద్యార్థి నగరంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు. అయితే సదరు విద్యార్థి పుట్టినరోజు (Birthday) సందర్భంగా పార్టీ చేసుకున్నారు. ఈ సందర్భంగా కొందరు విద్యార్థులు ర్యాగింగ్ (Raging) పేరుతో ఆ విద్యార్థిని ఇబ్బంది పెట్టారు. అంతా కలిసి రిషాంత్ రెడ్డి ప్రైవేట్ పార్ట్స్‌పై తన్నారు. రక్తం కారుతున్నా పట్టించుకోకుండా ఆ విద్యార్థిని ఇబ్బంది పెట్టారు.


సమాచారం అందుకున్న విద్యార్థి తల్లిదండ్రులు అక్కడికి చేరుకున్నారు. తమ కొడుకును కావాలనే కొందరు విద్యార్థులు ఇలా చిత్రహింసలు పెట్టారంటూ తల్లిదండ్రులు వాపోయారు. కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న నాచారం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, పుట్టిన రోజు నాడు సదరు వ్యక్తిని విపరీతంగా కొట్టడం అనేది యువతలో ఇప్పుడు ట్రెండ్ గా మారిపోయింది. ఇలాంటి విపరీత ధోరణులతో చిక్కుల్లో పడవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.


Also Read:

పేపర్‌తో హ్యాండ్ వాష్ క్రీమ్.. ఇతడి ప్రయోగం మామూలుగా లేదుగా..

ఈవీఎంలపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం

For More Latest News

Updated Date - Sep 17 , 2025 | 09:06 PM