Maha Kumbh Mela: 140 రైళ్లు.. 1.30 లక్షల మంది ప్రయాణికులు
ABN , Publish Date - Feb 11 , 2025 | 11:09 AM
కుంభమేళా జరిగే ప్రదేశాలకు దక్షిణమధ్యరైల్వే(South Central Railway) పరిధిలో 140 ప్రత్యేకరైళ్లు నడిపామని అధికారులు ప్రకటించారు. వివిధ ప్రాంతాల నుంచి ఆయా రైళ్లలో సుమారు 1.30లక్షల మంది రిజర్వేషన్ చేసుకున్న గయా, దానాపూర్, పాట్నా, ఆజంఘడ్, ప్రయాగరాజ్, రక్సాల్, బనారస్, గోమతినగర్(లక్నో) ప్రాంతాలకు ప్రయాణికులు వెళ్లివచ్చారని తెలిపారు.
- కుంభమేళాకు దక్షిణమధ్యరైల్వే 140 ప్రత్యేకరైళ్లు
- సోషల్‌మీడియాలో ప్రచారం వాస్తవం కాదు: సీపీఆర్‌ఓ శ్రీధర్
హైదరాబాద్ సిటీ: కుంభమేళా జరిగే ప్రదేశాలకు దక్షిణమధ్యరైల్వే(South Central Railway) పరిధిలో 140 ప్రత్యేకరైళ్లు నడిపామని అధికారులు ప్రకటించారు. వివిధ ప్రాంతాల నుంచి ఆయా రైళ్లలో సుమారు 1.30లక్షల మంది రిజర్వేషన్ చేసుకున్న గయా, దానాపూర్, పాట్నా, ఆజంఘడ్, ప్రయాగరాజ్, రక్సాల్, బనారస్, గోమతినగర్(లక్నో) ప్రాంతాలకు ప్రయాణికులు వెళ్లివచ్చారని తెలిపారు. ఇవి కాకుండా ఇతర జోన్ల నుంచి మరో 39ప్రత్యేక రైళ్లు దక్షిణ మధ్యరైల్వే జోన్ మీదుగా వెళ్లాయని పేర్కొన్నారు. కుంభమేళాకు ఏర్పాటుచేసిన ప్రత్యేకరైళ్లన్నీ 149శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయని వెల్లడించారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: యువత జోష్... మాబ్ డ్యాన్స్

ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవకుండా లక్నో, ప్రయాగరాజ్, న్యూఢిల్లీ(Lucknow, Prayagraj, New Delhi) డివిజన్ కార్యాలయాల నుంచి సీనియర్ రైల్వే ఉన్నతాధికారులు యాత్రికుల రద్దీని పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నారు. కాగా, ఆయా ప్రాంతాల్లో గంటల కొద్దీ ట్రాఫిక్‌జామ్ అవుతోందని, రైళ్లు ఎక్కడివక్కడ ఆగిపోయాయని సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారం సరికాదని సీపీఆర్‌ఓ శ్రీధర్(CPRO Sridhar) తెలిపారు. కుంభమేళాకు ప్రయాణికులు సజావుగా వెళ్లి వస్తున్నారని పేర్కొన్నారు.
ఈవార్తను కూడా చదవండి: Kavitha: కేసీఆర్ పాలన ఐఫోన్‌లా.. రేవంత్ పాలన చైనా ఫోన్‌లా ఉంది
ఈవార్తను కూడా చదవండి: RMP: మా సమస్యలపై బీఆర్‌ఎస్‌ది మొసలి కన్నీరు
ఈవార్తను కూడా చదవండి: అర్వింద్ మాటలు కాదు.. చేతల్లో చూపించాలి..: కవిత
ఈవార్తను కూడా చదవండి: కేసీఆర్ ఫామ్ హౌస్‌కే పరిమితం అయ్యారు: ఎంపీ ధర్మపురి ఆగ్రహం..
Read Latest Telangana News and National News