Bharat Fiber: భారత్ ఫైబర్.. తక్కువ ధరలో ఆకర్షణీయమైన ప్లాన్‌లివే..
ABN , Publish Date - Sep 25 , 2025 | 10:08 AM
బీఎస్‌ఎన్‌ఎల్ తమ కస్టమర్లకు భారత్ ఫైబర్ ద్వారా ఇంటర్‌నెట్ సేవలు అందించేందుకు ప్రత్యేక ప్లాన్‌లను అమలులోకి తెచ్చింది. ప్రస్తుతం ఇంట్లో టీవీలకు ఇంటర్‌నెట్ సౌకర్యం పెరిగింది. అందుకనుగుణంగా ప్రైవేట్ కంపెనీలు రకరకాల ఖరీదైన మోడమ్‌లతో ఇంటర్‌నెట్ సేవలతో పాటు టీవీ చానల్స్, ఓటీటీ యాప్స్‌ను తీసుకొచ్చాయి.
తక్కువ ధరలతో ల్యాండ్‌లైన్ కాల్స్, టీవీ చానల్స్, ఓటీటీలు
ఫైబర్ నెట్ డీలర్ల సమన్వయంతో సేవలు
ప్రభుత్వ ఉద్యోగులకు 10 శాతం డిస్కౌంట్
అమల్లోకి హైస్పీడ్ ఇంటర్నెట్ ప్లాన్‌లు
అనంతపురం ప్రెస్‌క్లబ్, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): బీఎస్‌ఎన్‌ఎల్ (BSNL) తమ కస్టమర్లకు భారత్ ఫైబర్ (Bharat Fiber) ద్వారా ఇంటర్‌నెట్ సేవలు అందించేందుకు ప్రత్యేక ప్లాన్‌లను అమలులోకి తెచ్చింది. ప్రస్తుతం ఇంట్లో టీవీలకు ఇంటర్‌నెట్ సౌకర్యం పెరిగింది. అందుకనుగుణంగా ప్రైవేట్ కంపెనీలు రకరకాల ఖరీదైన మోడమ్‌లతో ఇంటర్‌నెట్ సేవలతో పాటు టీవీ చానల్స్ (TV Channels), ఓటీటీ యాప్స్‌ను (OTT Apps) తీసుకొచ్చాయి. వాటి ధరలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీఎస్‌ఎన్‌ఎల్ ప్రైవేట్ టెలికాం సర్వీసుల కన్నా తక్కువ ధరలకే ఇంటర్‌నెట్, టీవీ చానల్స్, ఓటీటీ సేవలను అందిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులకు అన్ని ప్లాన్లపై 10 శాతం డిస్కౌంట్‌ను అమలు చేస్తోంది. ఇప్పటికే వేల సంఖ్యలో కస్టమర్లు ఈ సేవలను వినియోగిస్తున్నట్లు ఆ శాఖ అధికారులు చెబుతున్నారు.
రూ.400కే 444 చానల్స్, 9 ఓటీటీలు..
బీఎస్‌ఎన్‌ఎల్ ప్రవేశపెట్టిన భారత్ ఫైబర్ ద్వారా అనేక రకమైన సేవలను అందిస్తోంది. రూ.400 రీచార్జ్‌పై ల్యాండ్‌ఫోన్‌కు అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్టీడీ కాల్స్, రూ.500 సెక్యూరిటీ డిపాజిట్, 20 ఎంబీపీఎస్ స్పీడుతో 500 జీబీ వరకూ నెట్, ఆ తరువాత 2 ఎంబీపీఎస్ స్పీడుతో నెట్‌సౌకర్యాన్ని కల్పించింది. ఈ ప్లాన్ ద్వారా దాదాపు 444 పైగా టీవీ చానళ్లను అందిస్తోంది. వీటిలో ప్రధానంగా జెమినీ సిరీస్, ఈటీవీ హెచ్‌డీ సిరీస్, జీ సిరీస్, స్టార్ మా హెచ్‌డీ, నిక్ జూనియర్ తదితర చానళ్లను అందిస్తోంది. వీటితో పాటు 9 రకాల ఓటీటీలకు అవకాశం కల్పించింది. అందులో స్మార్ట్‌ప్లే టీవీ, ఓటీటీ ప్లే, డిస్ర్టో టీవీ, ఈటీవీ విన్, సన్ ఎన్‌ఎక్స్‌టీ, ఫ్యాన్‌కోడ్, ఓం టీవీ, రెడ్ హాట్, ఫ్రైడే ఓటీటీ చానళ్లు ఉంటాయి. ఈ ప్లాన్‌లో చేరాలంటే రూ.260 ఎఫ్‌టీటీహెచ్ రీచార్జ్‌తో పాటు రూ.140 టీవీ చానళ్లకు కలిపి మొత్తం రూ.400 రీచార్జ్ చేయాల్సి ఉంటుంది.
హైస్పీడ్ ఇంటర్నెట్ ప్లాన్‌లు..
బీఎస్‌ఎన్‌ఎల్ హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలను ఓ మోస్తారు ధరలతో తీసుకొచ్చింది. అందులో రూ. 399 నుంచి అమలు కానున్నాయి. వీటిలో ప్రధానంగా రూ. 449 రీచార్జ్ చేసుకుంటే... 50 ఎంబీపీఎస్ స్పీడు ఇంటర్‌నెట్ సేవలు 6 నెలల వాలిడిటీతో వర్తిస్తాయి. ఇందులో అన్‌లిమిటెడ్ కాల్స్, ఓటీటీ యాప్స్ ఉంటాయి. రూ.799 రీచార్జ్‌పై 125 ఎంబీపీఎస్ స్పీడ్‌తో 4000 జీబీ డేటా సేవలు, రూ. 599 రీచార్జ్‌పై 75 ఎంబీపీఎస్ స్పీడ్‌తో 4000 జీబీ డేటా, రూ.1299 రీచార్జ్‌తో 225 ఎంబీపీఎస్ స్పీడుతో 6000 జీబీ డేటా వర్తిస్తుంది. వీటితో పాటు మరో రెండు ప్లాన్ త్వరలో అమల్లోకి రానున్నట్లు అధికారులు చెబుతున్నారు.
ఫైబర్ నెట్ డీలర్లతో సమన్వయం
బీఎస్‌ఎన్‌ఎల్ ప్రవేశపెట్టిన భారత్ ఫైబర్ ఇంటర్‌నెట్ సేవలను కస్టమర్లకు అందించేందుకు ఫైబర్ నెట్ డీలర్లతో సమన్వయం చేసుకుంటోంది. నెట్ సేవలు అందిస్తున్న టెలికాం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్స్‌తో ఈ సేవలను కస్టమర్ల ఇంటివద్దకే వెళ్లి కనెక్షన్‌లు ఇచ్చేలా చర్యలు తీసుకుంటోంది. ఇంట్లో ల్యాండ్‌లైన్ ఫోన్ ఉన్న కస్టమర్లకు ఫోన్ ద్వారా కేబుల్ కనెక్షన్‌తో నెట్ సేవలు అందిస్తోంది. వాయిస్ కాల్స్ వద్దనుకున్న కస్టమర్లకు మోడమ్ సాయంతో ఇంటర్‌నెట్‌తో పాటు టీవీ చానల్స్, ఓటీటీ చానళ్ల సదుపాయం కల్పించింది.
హైస్పీడుతో భారత్ ఫైబర్ కనెక్షన్లు
భారత్ ఫైబర్ పేరుతో కస్టమర్లకు బీఎ్‌సఎన్‌ఎల్ పలు రకాల సేవలను అందిస్తోంది. రూ. 400 ప్లాన్‌తో ప్రారంభమై అత్యధిక స్పీడుతో అందించే పలు రకాల ప్లాన్లను అమలు చేస్తోంది. బీఎ్‌సఎన్‌ఎల్ కస్టమర్లు ఎక్కడున్నా హైస్పీడు ఇంటర్‌నెట్‌తో పాటు టీవీ చానళ్లు, ఓటీటీలను అందించేందుకు చర్యలు తీసుకుంది. భవిష్యత్తులో కస్టమర్లను ఆకర్షించే ప్లాన్లు మరిన్ని అమలు కానున్నాయి.
-ముజీబ్ పాషా, జనరల్ మేనేజర్, బీఎస్‌ఎన్‌ఎల్
ఈ వార్తలు కూడా చదవండి
అది నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం: మంత్రి లోకేష్
మీ వాదనలో నిజం ఉంటే సభకు రా.. జగన్‌కు మంత్రి సవాల్
For More Andhra Pradesh News and Telugu News..