Virat Kohli Leave RCB: IPL 2026: RCBకి విరాట్ కోహ్లీ గుడ్ బై..?
ABN , Publish Date - Oct 15 , 2025 | 09:37 PM
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి విరాట్ కోహ్లీ గుడ్ బై చెప్పనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఐపీఎల్ 2026 సీజన్‌కు సంబంధించిన కమర్షియల్ కాంట్రాక్ట్‌పై కోహ్లీ సంతకం చేయలేదనే ప్రచారం సాగుతోంది.
ఐపీఎల్ జట్లలో ఒక్కొక్క జట్టు ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. అదే విధంగా చెన్నై, ముంబై, బెంగళూరు వంటి పేర్లు చెప్పగానే ఠక్కున ధోని, రోహిత్ శర్మ, కింగ్ కోహ్లీల పేర్లు గుర్తుకు వస్తాయి. ఇంకా చెప్పాలంటే.. వాళ్లు లేనిదే ఆ జట్లను క్రికెట్ అభిమానులు ఊహించుకోలేరు. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విషయానికి వస్తే..ఇక్కడ కోహ్లీకి కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. అతడు బెంగళూరుకు చాలా కాలం కప్ అందించకపోయినా.. ఫ్యాన్ ఫాలోయింగ్ తగ్గలేదు. ఇటీవలే ఐపీఎల్ 2025లో కప్ గెలిచి.. ఆర్సీబీ అభిమానుల కలను కోహ్లీ నెరవేర్చాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఆర్సీబీ జట్టు, కోహ్లీ గురించి ఓ న్యూస్ వైరల్ అవుతోంది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB)కి విరాట్ కోహ్లీ గుడ్ బై చెప్పనున్నాడని(Virat Kohli Leave RCB) వార్తలు వినిపిస్తున్నాయి. ఐపీఎల్ 2026 సీజన్‌కు సంబంధించిన కమర్షియల్ కాంట్రాక్ట్‌పై కోహ్లీ(Virat Kohli) సంతకం చేయలేదనే ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ చేసిన వ్యాఖ్యలు కోహ్లీపై వచ్చే రూమర్స్ బలాన్ని చేకూరుస్తున్నాయి. ఐపీఎల్ ప్లేయర్ కాంట్రాక్ట్, కమర్షియల్ కాంట్రాక్ట్ మధ్య వ్యత్యాసాన్ని వెల్లడిస్తూ మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్(Mohammed Kaif) ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ వీడియో చేశాడు. కోహ్లీ ఆర్సీబీలోనే కొనసాగుతాడని స్పష్టం చేశాడు.
అయితే ఆర్సీబీ(RCB) కమర్షియల్ కాంట్రాక్ట్‌పై కోహ్లీ సంతకం చేయకపోవడానికి ఓ కారణం ఉందని కైఫ్ వెల్లడించారు. ఆర్‌సీబీకి కొత్త యజమాని వచ్చే అవకాశం ఉందని, కొత్తవారి రాకతో ఫ్రాంచైజీ నిర్ణయాలు మారవచ్చని, అందుకే కోహ్లీ(Kohil) వేచి చూస్తున్నాడని అన్నాడు. ఒకవేళ యజమాని మారితే.. కొత్త చర్చలు జరుగుతాయని, వీటిపై స్పష్టమైన సమాచారం లేదని, కోహ్లీ కూడా వేచి చూస్తున్నాడని కైఫ్ పేర్కొన్నాడు. కొత్త యాజమాన్యం వస్తే ఆర్సీబీ కోహ్లీ(Virat Kohli Leave RCB) గుడ్ చెప్పే అవకాశం మాత్రం చాలా తక్కువ ఉందని క్రీడా నిపుణులు చెబుతున్నారు. మరికొందరు మాత్రం గుడ్ బై చెప్పిన ఆశ్చర్యం లేదని అంటున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Afghanistan Players: ఐసీసీ ర్యాంకింగ్స్ విడుదల.. టాప్‌లో అఫ్గాన్ ప్లేయర్లు
జర్నలిజం విలువల పరిరక్షణలో ఏబీఎన్- ఆంధ్రజ్యోతి ముందుంది: సీఎం చంద్రబాబు
ప్రధాని మోదీ ఏపీ పర్యటనలో అప్రమత్తంగా ఉండాలి: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా