Afghanistan Players: ఐసీసీ ర్యాంకింగ్స్ విడుదల.. టాప్‌లో అఫ్గాన్ ప్లేయర్లు
ABN , Publish Date - Oct 15 , 2025 | 08:10 PM
అఫ్గానిస్థాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను అఫ్గాన్ 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఆ విజయం రషీద్ కీలకపాత్ర పోషించాడు.
ఒకప్పుడు అఫ్గానిస్తాన్ క్రికెట్ జట్టు అంటే..ఇతర టాప్ జట్లకు లెక్కే ఉండేది కాదు. అయితే తమ జట్టును సీరియస్ గా తీసుకోవాలని ఇటీవల కొన్ని మ్యా్చుల్లో సంచలన విజయాలతో అఫ్గానిస్తాన్ ప్రత్యర్థి జట్టులకు హెచ్చరికలు జారీ చేసింది. అంతేకాక తాజాగా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో కూడా టాప్ లోకి ఆ జట్టు ప్లేయర్లు దూసుకెళ్లారు. భారత్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, పాకిస్థాన్ వంటి టాప్ జట్ల ప్లేయర్లను వెనక్కి నెట్టి..అఫ్గాన్ ఆటగాళ్లు టాప్ లోకి దూసుకెళ్లారు. తాజాగా ఐసీసీ విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో అఫ్గాన్ ప్లేయర్లు సత్తా చాటారు.
అఫ్గానిస్థాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ (Rashid Khan) వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని తిరిగి దక్కించుకున్నాడు. ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను అఫ్గాన్ 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఆ విజయం రషీద్ కీలకపాత్ర పోషించాడు. మూడు మ్యాచ్‌ల్లో కలిపి 11 వికెట్లు పడగొట్టిన రషీద్ ఖాన్.. రెండో వన్డేలో ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. ఫలితంగా బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో నాలుగు స్థానాలు మెరుగుపర్చుకుని దక్షిణాఫ్రికా ప్లేయర్ కేశవ్ మహరాజ్‌ను వెనక్కినెట్టి టాప్‌లో నిలిచాడు.
అలానే అఫ్గాన్ ఆల్‌రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ (Azmatullah Omarzai) ఏకంగా 19 స్థానాలు ఎగబాకి 21వ ర్యాంకులో నిలిచాడు. అతడు బంగ్లా సిరీస్‌లో ఏడు వికెట్లు సాధించాడు. అజ్మతుల్లాకు వన్డే కెరీర్‌లో బెస్ట్ ర్యాంకు ఇదే కావడం గమనార్హం. మరోవైపు, వన్డే ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో సికిందర్ రజా (జింబాబ్వే)ను వెనక్కి నెట్టి ఒమర్జాయ్ అగ్రస్థానం సాధించాడు.
ఇక వన్డే బ్యాటింగ్ ర్యాంకుల విషయానికొస్తే.. టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ టాప్‌లో కొనసాగుతున్నాడు. అలానే అఫ్గాన్ బ్యాటర్ ఇబ్రహీం జాద్రాన్ (Ibrahim Zadran) ఎనిమిది స్థానాలు మెరుగుపర్చుకుని రెండో ర్యాంకుకు చేరుకున్నాడు. ఓ అఫ్గాన్ బ్యాటర్ టాప్ 2 నిలవడం ఇదే మొదటిసారి. బంగ్లాపై మూడు మ్యాచ్‌ల్లో జద్రాన్ 213 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. రెండో వన్డేలో (95), మూడో వన్డేలో (95) పరుగులు చేసి త్రుటిలో శతకాలు మిస్ చేసుకున్నాడు.
ఇక, రోహిత్ శర్మ(Rohit Sharma), బాబర్ అజామ్, విరాట్ కోహ్లీ(Virat Kohili) వరుసగా మూడు, నాలుగు, ఐదు ర్యాంకుల్లో నిలిచారు. టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో భారత్ నుంచి యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్ టాప్-10లో ఉన్నారు. వెస్టిండీస్ పై రెండో టెస్టులో భారీ శతకం (175) బాదిన యశస్వి జైస్వాల్(Jaiswal) రెండు స్థానాలు మెరుగై ఐదో ర్యాంకు దక్కించుకున్నాడు. రిషభ్ పంత్(Panth) ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. మొత్తంగా ఐసీసీ ర్యాంకింగ్స్ లో అఫ్గానిస్తాన్(Afghanistan Players) ప్లేయర్లు అదరగొట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి:
జర్నలిజం విలువల పరిరక్షణలో ఏబీఎన్- ఆంధ్రజ్యోతి ముందుంది: సీఎం చంద్రబాబు
ప్రధాని మోదీ ఏపీ పర్యటనలో అప్రమత్తంగా ఉండాలి: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా