Share News

Maoist Party Big Shock: మావోయిస్టులకు మరో బిగ్ షాక్..!

ABN , Publish Date - Oct 15 , 2025 | 07:13 PM

మావోయిస్టు పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. మల్లోజుల బాటలో కీలక నేతలు నడిచేందుకు సిద్ధమయ్యారు. మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న పోలీసుల ఎదుట లొంగిపోయేందుకు రెడీ అయ్యారు.

Maoist Party Big Shock: మావోయిస్టులకు మరో బిగ్ షాక్..!
Maoist Party

ఇంటర్నెట్ డెస్క్, అక్టోబర్ 15: మావోయిస్టు పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. మల్లోజుల బాటలో కీలక నేతలు నడిచేందుకు సిద్ధమయ్యారు. మావోయిస్టు(Maoist) అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న పోలీసుల ఎదుట లొంగిపోయేందుకు రెడీ అయ్యారు. గురువారం ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్‌ ముందు ఆశన్న లొంగిపోనున్నారని సమాచారం. ఆయనతో పాటు మరో 70 మంది మావోయిస్టులు(Maoist Party Big Shock) కూడా సీఎం ముందు జనజీవన స్రవంతిలో కలవనున్నారు.


బుధవారం ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh)లోని సుక్మా జిల్లాలో 27 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు ప్రకటించారు. వీరిపై రూ.50లక్షల రివార్డు ఉంది. సీపీఐ (మావోయిస్టు) కేంద్ర కమిటీ, పొలిట్‌ బ్యూరో, సెంట్రల్‌ మిలిటరీ కమిషన్‌ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్‌రావు అలియాస్‌ అభయ్‌ అధికారికంగా పోలీసులకు లొంగిపోయిన సంగతి తెలిసిందే. మహారాష్ట్రలో ఈ మేరకు మల్లోజులను(Maoist movement) పోలీసులు మీడియా ముందుకు తీసుకొచ్చారు. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ సమక్షంలో ఆయన ఆయుధాలు అప్పగించారు. ఈ రెండు షాకులతో మావోయిస్టులు అల్లాడుతుంటే.. తాజాగా ఆశన్న లొంగిపోతున్నారనే వార్త.. వారికి మరో దెబ్బ తగినట్లే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.



ఈ వార్తలు కూడా చదవండి:

జర్నలిజం విలువల పరిరక్షణలో ఏబీఎన్- ఆంధ్రజ్యోతి ముందుంది: సీఎం చంద్రబాబు

ప్రధాని మోదీ ఏపీ పర్యటనలో అప్రమత్తంగా ఉండాలి: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా

Updated Date - Oct 15 , 2025 | 07:39 PM