Share News

Virat Kohli Breaks Sachin: సచిన్ వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేసిన విరాట్

ABN , Publish Date - Oct 25 , 2025 | 04:51 PM

ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. పెర్త్, అడిలైడ్ మ్యాచ్ లో డకౌటైన కోహ్లీ .. సిడ్నీ వేదికగా జరిగిన మూడో వన్డేలో మాత్రం ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.

 Virat Kohli Breaks Sachin: సచిన్ వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేసిన విరాట్
Virat Kohli

క్రికెట్ న్యూస్: ఆస్ట్రేలియా(Australia)తో జరిగిన మూడో వన్డేలో టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. పెర్త్, అడిలైడ్ మ్యాచ్ లో డకౌటైన కోహ్లీ .. సిడ్నీ వేదికగా జరిగిన మూడో వన్డేలో మాత్రం ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. రోహిత్ శర్మ(121), కోహ్లీ(74 ) అద్భుతంగా రాణించడంతో 9 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ఇక ఈ వన్డేలో విరాట్.. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న వరల్డ్ రికార్డును(Sachin World Record) బ్రేక్ చేశాడు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..


మూడో వన్డేలో విరాట్ కోహ్లీ(Virat Kohli) 74 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. దీంతో వన్డే ఛేజింగ్‌లలో అత్యధిక 50+ స్కోర్లుగా సచిన్ టెండూల్కర్ ప్రపంచ రికార్డును కోహ్లీ బద్దలు కొట్టాడు. ఆసీస్ వన్డేలో హాఫ్ సెంచరీ చేయడంతో .. వన్డే ఛేజింగ్‌లో 50+ స్కోర్ ను కోహ్లీ 70 సార్లు చేశాడు. ఇప్పటి వరకు సచిన్(70)(Sachin Tendulkar world record) పేరిట ఈ రికార్డు ఉంది. ఈ మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లీ(14,235, 293 ఇన్నింగ్స్) వన్డేల్లో రెండో అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచాడు. ఇంతకు ముందు మూడోస్థానంలో ఉన్న కోహ్లీ.. ఈ మ్యాచ్‌లో శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కరను(Sangakkara) (14,234 పరుగులు) అధిగమించాడు. కోహ్లీ కంటే ముందు 452 ఇన్నింగ్స్ లో 18,426 పరుగులతో సచిన్‌ టెండూల్కర్‌ ఉన్నాడు.


వన్డే ఛేజింగ్‌లలో అత్యధికంగా 50+ స్కోర్లు

1. విరాట్ కోహ్లీ (IND) - 70

2. సచిన్ టెండూల్కర్ (IND) - 70

3. రోహిత్ శర్మ (IND) - 55

4. జాక్వెస్ కల్లిస్ (IND) - 50



Also Read:

KTR VS Congress: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కి తగిన బుద్ధి చెప్పాలి: కేటీఆర్

IND VS AUS: రోహిత్‌ శర్మ సెంచరీ..మూడో వన్డేలో భారత్ ఘన విజయం

Updated Date - Oct 25 , 2025 | 05:44 PM