Share News

Rohit Sharma: రోహిత్ శర్మ సూపర్ సెంచరీ..

ABN , Publish Date - Oct 25 , 2025 | 04:25 PM

సిడ్నీ(Sydney)లో జరుగుతున్న మూడో వన్డేలో రోహిత్ శర్మ(Rohit Sharma) బ్యాట్‌తో చెలరేగుతున్నాడు. 105 బంతుల్లో అద్భుత సెంచరీ చేసి అదరగొట్టాడు.

Rohit Sharma: రోహిత్ శర్మ సూపర్ సెంచరీ..
Rohit Sharma

సిడ్నీ(Sydney)లో ఆసీస్‌తో జరిగిన మూడో వన్డేలో రోహిత్ శర్మ(121*) బ్యాట్‌తో చెలరేగాడు. 105 బంతుల్లోనే అద్భుత సెంచరీ చేసి అదరగొట్టాడు. రెండు సిక్స్‌లు, 11 ఫోర్ల సాయంతో శతక్కొట్టాడు. మెుత్తం 125 బంతులను ఎదుర్కొని 121 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మొదటి వన్డేలో 8 పరుగులకే పెవిలియన్ బాట పట్టిన రోహిత్ శర్మ.. రెండో వన్డే నుంచి ఫామ్‌లోకి వచ్చాడు. అడిలైడ్‌ (Adelaide)లో హాఫ్ సెంచరీ చేసి ఆకట్టుకోగా.. ప్రస్తుతం సిడ్నీలో సెంచరీ(Super Century)తో చెలరేగాడు.


కోహ్లీ సైతం కుమ్మేశాడు..

వరుసగా తొలి రెండు వన్డేల్లో డకౌట్‌గా వెనుదిరిగిన విరాట్ కోహ్లీ(Virat Kohli) మూడో వన్డేలో కుదురుకున్నాడు. 81 బంతులను ఎదుర్కొని 74 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 54 బంతుల్లోనే విరాట్ తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతోపాటు ఓ అరుదైన రికార్డునూ సాధించాడు. వన్డేల్లో రెండో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు.


Also Read:

KTR VS Congress: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కి తగిన బుద్ధి చెప్పాలి: కేటీఆర్

IND VS AUS: రోహిత్‌ శర్మ సెంచరీ..మూడో వన్డేలో భారత్ ఘన విజయం

Updated Date - Oct 25 , 2025 | 05:23 PM