Share News

IND VS AUS: రోహిత్‌ శర్మ సెంచరీ..మూడో వన్డేలో భారత్ ఘన విజయం

ABN , Publish Date - Oct 25 , 2025 | 03:54 PM

సిడ్నీ వన్డేలో భారత్‌ ఘన విజయం సాధించింది. 9 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై గెలుపొందింది. చివరి వన్డేలో రోహిత్‌ శర్మ సెంచరీతో చేలరేగాడు. ఈ విజయంతో 3 వన్డేల సిరీస్‌ను 2-1 తేడాతో ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది.

IND VS AUS:  రోహిత్‌ శర్మ సెంచరీ..మూడో వన్డేలో భారత్ ఘన విజయం
India Won

క్రికెట్ న్యూస్: ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ తొలి విజయాన్ని నమోదు చేసింది. సిడ్నీ వేదికగా జరిగిన మూడో వన్డేలో టీమిండియా 9 వికెట్ల తేడాతో ఆసీస్ పై ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో రోహిత్ (121*) సెంచరీతో చెలరేగాడు. అలానే కోహ్లీ(74*) సైతం ఈ మ్యాచ్ లో సూపర్ బ్యాటింగ్ చేశాడు. ఈ మ్యాచ్ లో విజయం సాధించినప్పటికీ భారత్ సిరీస్ కోల్పోయింది. ఆస్ట్రేలియా 2-1 తేడాతో సిరీస్ ను కైవసం చేసుకుంది.


మూడో వన్డేలో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ కు దిగిన ఆస్ట్రేలియా‌(Australia) 46.4 ఓవర్లలో 236 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్‌ బ్యాటర్లలో మ్యాట్‌ రెన్‌షా (56), మిచెల్‌ మార్ష్‌ (41) రాణించారు. టీమిండియా బౌలర్లలో హర్షిత్ రాణా 4, సుందర్ 2.. సిరాజ్, కుల్‌దీప్‌, అక్షర్, ప్రసిద్ధ్‌ కృష్ణ తలో వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్‌ ప్రారంభించిన భారత్‌కు శుభారంభం దక్కింది. కెప్టెన్ శుభ్‌మన్‌ గిల్‌, రోహిత్‌ శర్మ తొలి వికెట్‌కు 69 పరుగులు జత చేశారు. 24 పరుగుల వద్ద హేజిల్‌వుడ్‌ బౌలింగ్‌లో గిల్‌ ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కోహ్లీ తొలి బంతికే తన పరుగుల ఖాతా తెరిచాడు. మొదటి రెండు వన్డేల్లో వరుసగా డకౌట్‌ అయిన కోహ్లీ ఈ మ్యాచ్‌లో మాత్రం తన రిథమ్‌లోకి రావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు.


రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ స్వేచ్ఛగా పరుగులు రాబట్టారు. వీరు మూడో వికెట్‌కు 169 బంతుల్లో 168 పరుగులు చేశారు. అడిలైడ్ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసిన రోహిత్‌(century by Rohit Sharma) ఈ వన్డేలో ఏకంగా సెంచరీ (125 బంతుల్లో 121 పరుగులు) చేశాడు. ఇది రోహిత్‌ శర్మకు ఓవరాల్‌గా 50వ సెంచరీ. వన్డేల్లో అతడికిది 33వ శతకం. ఆస్ట్రేలియా నిర్దేశించిన లక్ష్యాన్ని 38.3 ఓవర్లలోనే కేవలం ఒక వికెట్‌ కోల్పోయి(India victory) చేధించింది. ఆసీస్‌ బౌలర్లలో జోష్‌ హేజిల్‌వుడ్‌ మాత్రమే ఒక వికెట్‌ పడగొట్టాడు. ఆస్ట్రేలియాలో పర్యటిస్తూ ఆ జట్టుపై ఎక్కువ సెంచరీలు (6) చేసింది కూడా రోహిత్‌ శర్మనే. ఆ తర్వాతి స్థానంలో విరాట్‌ కోహ్లీ (5)(Virat Kohli) ఉన్నాడు.


ఇవి కూడా చదవండి..

ఉబర్ బుక్ చేసుకున్న భారత ప్లేయర్లు!

టీమిండియాకు షాక్.. శ్రేయస్ అయ్యర్‌కు తీవ్ర గాయం!

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 25 , 2025 | 04:16 PM