Virat Kohli: కోహ్లీకి కలిసి రాని ‘అక్టోబర్ 25’.. ఈసారి ఏం జరుగుతుందో!
ABN , Publish Date - Oct 25 , 2025 | 01:57 PM
కోహ్లీకి అక్టోబర్ 25 అస్సలు కలిసి రాదనే రికార్డు ఉంది. తన కెరీర్‌లో ఈ తేదీన ఆడిన వన్డేల్లో కోహ్లీ అత్యధిక స్కోర్ 30 పరుగులే. ఈ నేపథ్యంలో సిడ్నీలో ఈ ప్రతికూల రికార్డును కోహ్లీ ఎలా అధిగమిస్తామనేది ఆసక్తికరంగా మారింది..
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఫామ్ లేమితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. సుదీర్ఘ విరామం తర్వాత జట్టులోకి వచ్చిన విరాట్.. ఆసీస్‌తో రెండు వన్డేల్లోనూ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఈ చివరి మ్యాచ్‌లో అయినా కోహ్లీ ఆడితే చూడాలని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే కోహ్లీకి అక్టోబర్ 25 అస్సలు కలిసి రాదనే రికార్డు ఉంది. తన కెరీర్‌లో ఈ తేదీన ఆడిన వన్డేల్లో కోహ్లీ అత్యధిక స్కోర్ 30 పరుగులే. ఈ నేపథ్యంలో సిడ్నీలో ఈ ప్రతికూల రికార్డును కోహ్లీ ఎలా అధిగమిస్తామనేది ఆసక్తికరంగా మారింది.
కోహ్లీ (Virat Kohli) గత రికార్డులు చూస్తే.. 2011లో ఇంగ్లండ్‌పై ఆడిన వన్డేలో పరుగుల ఖాతా కూడా తెరవలేదు. 2015లో సౌతాఫ్రికా(South Africa)తో ఆడిన మ్యాచ్‌లో 7 పరుగులు మాత్రమే చేశాడు. 2017లొ న్యూజిలాండ్‌తో ఆడిన వన్డేలో కూడా కేవలం 29 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు. అంటే ఇప్పటి వరకు అక్టోబర్ 25న ఆడిన నాలుగు వన్డే మ్యాచ్‌ల్లో ఆసీస్‌పై చేసిన 30 పరుగులే అతడి అత్యధిక స్కోర్.
దాదాపు 16 ఏళ్ల తర్వాత, మళ్లీ అదే అక్టోబర్ 25.. అదే ఆసీస్ జట్టుతో మ్యాచ్ ఆడటానికి కోహ్లీ బరిలోకి దిగాడు. వరుస డకౌట్‌లు.. తేదీ ప్రతికూల రికార్డు.. తీవ్ర ఒత్తిడి నడుమ కోహ్లీ అధిగమిస్తాడా? అభిమానుల ఆశ నెరవేరుస్తాడా? అనేది చూడాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
ఉబర్ బుక్ చేసుకున్న భారత ప్లేయర్లు!
టీమిండియాకు షాక్.. శ్రేయస్ అయ్యర్‌కు తీవ్ర గాయం!
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..