Virat Kohli: సిడ్నీలో ఆసక్తికర ఘటన.. కోహ్లీ చెబితే వినాల్సిందే!
ABN , Publish Date - Oct 25 , 2025 | 04:13 PM
యువ ఆటగాళ్లకు కొత్త విషయాలు చెప్పడంలో కింగ్ ఎప్పుడూ ముందుంటాడనే విషయం తెలిసిందే. అయితే ఓవర్ల మధ్యలో గిల్ తన ఫీల్డింగ్ పొజిషన్‌కు వెళ్తుండగా కోహ్లీ ఆపాడు. గిల్ చేయి పట్టుకుని లాగి మరీ కోహ్లీ చర్చ పెట్టాడు.
సిడ్నీ(Sydney)లో ఆసీస్-భారత్ మధ్య మూడో వన్డే మ్యాచ్ కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. యువ ఆటగాళ్లకు కొత్త విషయాలు చెప్పడంలో కింగ్ ఎప్పుడూ ముందుంటాడనే విషయం తెలిసిందే. అయితే ఓవర్ల మధ్యలో గిల్ తన ఫీల్డింగ్ పొజిషన్‌కు వెళ్తుండగా కోహ్లీ(Virat Kohli) ఆపాడు. అటువైపుగా కేఎల్ రాహుల్ వస్తుంటే. గిల్ చేయి పట్టుకుని లాగి మరీ కోహ్లీ చర్చ పెట్టాడు. ముగ్గురూ కలిసి కాసేపు మాట్లాడుకుని తర్వాత వారి పొజిషన్‌కు వెళ్లారు. అయితే కెప్టెన్సీలో మాత్రమే కాదు.. ఎలాగైనా కలిసిపోతానంటూ విరాట్ నిరూపించాడు.
హమ్మయ్యా.. ఎట్టకేలకు పరుగుల ఖాతా ఓపెన్..
గత రెండు వన్డేల్లో కోహ్లీ బ్యాట్‌కు పని చెప్పకుండా డకౌట్‌గా పెవిలియన్ చేరిన విషయం తెలిసిందే. అయితే మూడో వన్డేలో మాత్రం అతడికి భారీ ఊరట కలిగింది. తాను ఎదుర్కొన్న తొలి బంతినే సింగిల్‌గా మలిచి ఊపిరి పీల్చుకున్నాడు. దీంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పరుగు పూర్తి చేశాక కోహ్లీ కూడా నవ్వేశాడు. ఆ తర్వా కోహ్లీ(35*) దూకుడు ప్రదర్శిస్తున్నాడు.
Also Read:
IND VS AUS: రోహిత్ శర్మ సెంచరీ..మూడో వన్డేలో భారత్ ఘన విజయం
TG Govt On Jobs: గుడ్‌న్యూస్.. త్వరలో భారీగా ఉద్యోగాల భర్తీ
Bihar Elections: పంచ పాండవుల కూటమి మాది: అమిత్‌షా