Share News

Vijay Hazare Trophy: టాస్ ఓడిన ఆంధ్ర.. బ్యాటింగ్ ఎవరంటే?

ABN , Publish Date - Dec 24 , 2025 | 09:21 AM

విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా తొలి మ్యాచ్‌లో ఢిల్లీ-ఆంధ్ర జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఢిల్లీ.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ఆంధ్ర జట్టు తొలుత బ్యాటింగ్ చేయనుంది.

Vijay Hazare Trophy: టాస్ ఓడిన ఆంధ్ర.. బ్యాటింగ్ ఎవరంటే?
Vijay Hazare Trophy

ఇంటర్నెట్ డెస్క్: విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ గ్రౌండ్ వేదికగా ఢిల్లీ-ఆంధ్ర తొలి మ్యాచ్‌లో తలపడనున్నాయి. స్టార్ ఆటగాళ్లు ఈ టోర్నీ ఆడుతుండటంతో అందరి దృష్టి దీనిపై పడింది. తాజాగా దీనికి సంబంధించి టాస్ పడింది. ఢిల్లీ టాస్ గెలిచి.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ఆంధ్ర జట్టు తొలుత బ్యాటింగ్ చేయనుంది.


ఢిల్లీ జట్టుకు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. కాగా ఈ జట్టుకు రిషభ్ పంత్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. కోహ్లీ ఇప్పుడు పంత్ నేతృత్వంలో బరిలోకి దిగనున్నాడు. మరోవైపు ఆంధ్ర జట్టుకు మన తెలుగబ్బాయి నితీశ్ కుమార్ రెడ్డి నాయకత్వం వహిస్తున్నాడు.


ఢిల్లీ తుది జట్టు:

అర్పిత్ రానా, ప్రియాంశ్ ఆర్య, విరాట్ కోహ్లీ, నితీశ్ రాణా, రిషభ్ పంత్(కెప్టెన్), ఆయుశ్ బదోనీ, సిమర్‌జీత్ సింగ్, హర్ష్ త్యాగ్, ఇషాంత్ శర్మ, ప్రిన్స్ యాదవ్, నవదీప్ సైనీ.


ఆంధ్ర తుది జట్టు:

శ్రీకర్ భరత్, అశ్విన్ హెబ్బర్, షేక్ రషీద్, రికీ, నితీశ్ కుమార్ రెడ్డి(కెప్టెన్), సౌరభ్ కుమార్, మారాంరెడ్డి హెమంత్, కేఎస్ నరసింహ రాజు, త్రిపురన విజయ్, సత్యనారాయణ రాజు, ప్రసాద్.


రోహిత్ కూడా..

ఇక గ్రూప్-సిలో భాగంగా ముంబైతో మ్యాచులో సిక్కిం టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో కోహ్లీ మాదిరే రోహిత్ శర్మ కూడా ఛేదనలోనే బ్యాటింగ్ చేయనుంది.


ముంబై తుది జట్టు:

రోహిత్ శర్మ, అంగ్క్రిష్ రఘువంశీ, సర్ఫరాజ్ ఖాన్, సిద్ధేశ్ లాడ్, ముషీర్ ఖాన్, హార్దిక్ టామోర్(వికెట్ కీపర్), షామ్స్ ములానీ, తనుష్ కోటియన్, శార్దూల్ ఠాకూర్(కెప్టెన్), తుషార్ దేశ్‌పాండే, సిల్వెస్టర్ డిసౌజా.


సిక్కిం తుది జట్టు:

లీ యోంగ్ లెప్చా, ఆశిష్ థావా, అమిత్ రాజేరా, రాబిన లింబూ, గురీందర్ సింగ్, క్రాంతి కుమార్, పల్జోర్ తమాంగ్, అంకుర్ మాలిక్, కె సాయి సాత్విక్, ఎండీ సప్తుల్లా, అభిషేక్ కేఆర్ షా.


ఇవీ చదవండి:

టీ20 ర్యాంకింగ్స్‌.. టాప్‌లో దీప్తి శర్మ!

టీ20ల్లో నయా రికార్డు.. ఒకే ఓవర్‌లో 5 వికెట్లు

Updated Date - Dec 24 , 2025 | 09:35 AM