U19 Asia Cup: పాక్ ప్లేయర్స్‌కి ‘షూ’ చూపించిన వైభవ్.. వీడియో వైరల్
ABN , Publish Date - Dec 21 , 2025 | 05:45 PM
అండర్ 19 ఆసియా కప్ 2025 ట్రోఫీని పాకిస్తాన్ సొంతం చేసుకుంది. పాక్ నిర్దేశించిన 348 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో టీమిండియా విఫలమైంది. అయితే వైభవ్ సూర్యవంశీకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: అండర్ 19 ఆసియా కప్ 2026లో భాగంగా దుబాయ్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన ఫైనల్ పోరులో టీమిండియా బోల్తా పడింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కి దిగిన పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 347 పరుగులు చేసింది. 348 పరుగుల భారీ విజయ లక్ష్యంతో ఛేదనకు దిగిన టీమిండియా 156 పరుగులకే కుప్పకూలింది. 191 పరుగుల భారీ తేడాతో పాక్ ఆసియా కప్‌ను సొంతం చేసుకుంది. అయితే యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ(Vaibhav Suryavanshi), పాక్ ప్లేయర్ల మధ్య జరిగిన ఓ వివాదం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
అసలేం జరిగిందంటే..?
పాకిస్థాన్ నిర్దేశించిన 347 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో భారత్ ఇన్నింగ్స్ ఆరంభించింది. టీమిండియా ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ క్రీజులోకి వచ్చినప్పటి నుంచే పాక్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అయితే భారత స్కోరు 49 పరుగుల వద్ద ఉన్నప్పుడు వైభవ్ సూర్యవంశీ.. అలీ రజా బౌలింగ్‌లో అయ్యాడు. ఈ టోర్నీలో ఫుల్ ఫామ్‌లో ఉన్న వైభవ్ వికెట్ పడటంతో పాక్ ఆటగాళ్లు అత్యుత్సాహంతో సెలబ్రేషన్స్ చేసుకున్నారు.
వైభవ్ సైలెంట్‌గా డ్రెస్సింగ్ రూమ్ వైపు వెళ్తున్న సమయంలో ఓ పాక్ ప్లేయర్ అతడిని ఉద్దేశించి ఓ కామెంట్ చేశాడు. దీంతో వైభవ్ తీవ్రంగా స్పందించాడు. వెనక్కి తిరిగి పాక్ జట్టు వైపు చూస్తూ తన ‘షూ’ను చూపించాడు. ‘మీ స్థానం ఇక్కడ’ అన్నట్లు సైగ చేశాడు. ఈ ఘటన మైదానంలో కలకలం రేపింది. అంప్లైర్లు జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇవీ చదవండి:
చతికిలపడ్డ టీమిండియా.. పాకిస్తాన్ ఘన విజయం
మా కల చెదిరిపోయింది.. బెన్ స్టోక్స్ ఎమోషనల్ వ్యాఖ్యలు