Ashwin: ఇషాన్‌కు ఇది క్రికెట్ ఇచ్చిన గిఫ్ట్: అశ్విన్
ABN , Publish Date - Dec 21 , 2025 | 03:03 PM
టీ20 ప్రపంచ కప్ 2026కి సంబంధించి భారత జట్టును సెలక్టర్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్ చోటు దక్కించుకున్నాడు. టీమిండియాలోకి ఇషాన్ రీఎంట్రీపై భారత మాజీ స్పిన్నర్ అశ్విన్ స్పందించాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026కి ఇంకా 50 రోజుల సమయం ఉండగానే.. దానికి సంబంధించి భారత జట్టును సెలక్టర్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో అనూహ్యంగా టెస్టు, వన్డేల కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు చటు దక్కలేదు. ఊహించినట్లే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అద్భుతంగా రాణించి.. సెంచరీతో అలరించిన ఇషాన్ కిషన్(Ishan Kishan)ను సెలక్టర్లు ఎంపిక చేశారు. బీసీసీఐ చెప్పిన మాట వినలేదని అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ఇషాన్ కిషన్‌ను ఉన్నట్టుండి జట్టులోంచి తప్పించిన విషయం తెలిసిందే. అదే ఫామ్‌ను కొనసాగిస్తూ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఈ విషయంపై టీమిండియా మాజీ స్పిన్నర్ అశ్విన్(Ashwin) తన యూట్యాబ్ ఛానెల్‌లో మాట్లాడాడు.
‘ఇది ఇషాన్ కిషన్‌కు క్రికెట్ ఇచ్చిన గిఫ్ట్. చాలా మంది బయట నుంచి రకరకాలుగా ఊహించుకోవచ్చు. మరికొందరు ఇది అన్యాయం అని కూడా చెప్పొచ్చు. కానీ జీవిత చక్రం తిరిగి అక్కడికే వచ్చింది. అతడు జట్టులో స్థానం కోల్పోవడానికి.. తిరిగి జట్టులోకి రావడానికి కారణం ఒకటే.. అతడు క్రికెట్‌కు ఇవ్వాల్సినంత గౌరవం ఇచ్చాడు. ఇషాన్ బుచ్చిబాబు ట్రోఫీ ఆడాడు. అందులో ఝార్ఖండ్ జట్టుకి నాయకత్వం వహించాడు. రంజీ ట్రోఫీ ప్రిపరేషన్‌లో ఆ జట్టులో నంబర్ వన్ ఆటగాడిగా నిలిచాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో పరుగుల వరద పారించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో జట్టును విజయపథంలో నడిపించాడు. ఇషాన్ శక్తివంచన లేకుండా ప్రయత్నించాడు. ఆటను గౌరవించి విజయం సాధించాడు.
నువ్వు పెద్ద ఆటగాడివా, చిన్న ఆటగాడివా.. కొత్తగా వచ్చావా.. అన్నది కాదు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో రాణించు.. మా కళ్లు ఎప్పుడూ మీ పై ఉంటాయి.. అనే సందేశాన్ని సెలక్టర్లు కూడా ప్లేయర్లకు బలంగా పంపారు. వన్డేల్లో ఇషాన్ డబుల్ సెంచరీ చేసిన తీరే అతడేంటో చెబుతుంది’ అని అశ్విన్ వెల్లడించాడు.
ఇవీ చదవండి: