Share News

T20 Womens Cricket: యువ క్రికెటర్లకు పరీక్ష

ABN , Publish Date - Dec 21 , 2025 | 06:46 AM

వన్డే వరల్డ్‌ కప్‌ గెలిచిన జోష్‌లో ఉన్న భారత మహిళల జట్టు మరో సిరీ్‌సకు సిద్ధమైంది. శ్రీలంకతో ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా ఆదివారం వైజాగ్‌లో జరిగే తొలి మ్యాచ్‌లో...

T20 Womens Cricket: యువ క్రికెటర్లకు పరీక్ష

శ్రీలంక మహిళలతో భారత్‌ తొలి టీ20 నేడు

విశాఖపట్నం (ఆంధ్రజ్యోతి స్పోర్ట్స్‌): వన్డే వరల్డ్‌ కప్‌ గెలిచిన జోష్‌లో ఉన్న భారత మహిళల జట్టు మరో సిరీ్‌సకు సిద్ధమైంది. శ్రీలంకతో ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా ఆదివారం వైజాగ్‌లో జరిగే తొలి మ్యాచ్‌లో తలపడనుంది. వచ్చే జూన్‌లో ఇంగ్లండ్‌ వేదికగా జరిగే పొట్టి ప్రపంచ కప్‌నకు లంకతో సిరీ్‌సను టీమిండియా సన్నాహకంగా భావిస్తోంది. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌, వైస్‌ కెప్టెన్‌ మంధాన, జెమీమా, దీప్తి, రేణుక, షఫాలీ, హర్లీన్‌ తదితరులతో భారత్‌ పటిష్టంగా ఉంది. అయితే వచ్చే వరల్డ్‌ కప్‌ నేపథ్యంలో యువ బ్యాటర్‌ కమిలిని, యువ స్పిన్నర్లు శ్రీచరణి, వైష్ణవీ శర్మలను ఈ సిరీస్‌ ద్వారా నిశితంగా పరీక్షించాలని జట్టు మేనేజ్‌మెంట్‌ భావిస్తోంది. మరోవైపు సీనియర్‌ చమరి ఆటపట్టు సారథ్యంలోని శ్రీలంక కూడా పలువురు యువ క్రికెటర్లను ఈ సిరీస్‌ ద్వారా పరిశీలిస్తోంది. ఇక టీ20ల్లో ఇప్పటిదాకా ఇరుజట్లు 26సార్లు తలపడితే, 20 విజయాలతో భారత్‌ ఆధిక్యంలో ఉంది.

ఇవీ చదవండి:

T20 World Cup 2026: టీ20 భారత జట్టు ప్రకటన.. గిల్‌కు షాక్..

నేను కోలుకుంటున్నా.. త్వరలోనే మైదానంలోకి వస్తా: యశస్వి జైస్వాల్

Updated Date - Dec 21 , 2025 | 06:52 AM