Ind Vs Pak: చెలరేగిన సమీర్ మిన్హాస్.. భారత్ టార్గెట్ 348
ABN , Publish Date - Dec 21 , 2025 | 02:36 PM
అండర్ 19 ఆసియా కప్‌లో భాగంగా ఫైనల్ పోరులో ఇండియా-పాకిస్తాన్ జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కి దిగిన పాక్.. 50 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 347 పరుగులు చేసింది. టీమిండియా విజయ లక్ష్యం 348 పరుగులు.
ఇంటర్నెట్ డెస్క్: దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీ వేదికగా ఇండియా-పాకిస్తాన్ జట్లు ఫైనల్ పోరులో తలపడుతున్నాయి. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా.. పాకిస్తాన్ జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. పాక్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 347 పరుగులు చేసింది. భారత్‌కు 348 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
పాక్ బ్యాటర్ సమీర్ మిన్హాస్(172) భారీ సెంచరీతో చెలరేగి ఆడాడు. అహ్మద్ హుస్సేన్(56) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. వీరిద్దరూ కలిపి ఏకంగా 125 బంతుల్లో 137 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఉస్మాన్ ఖాన్(35) రాణించాడు. హంజా జహూర్(18), ఫర్హాన్ యూసఫ్(19), మహ్మద్ షయాన్(7), అబ్దుల్ సుభాన్(2) పరుగులకు పెవిలియన్ చేరారు. నికాబ్(12), మహ్మద్ సయ్యం(13) నాటౌట్‌గా నిలిచారు. భారత బౌలర్లలో దీపేశ్ దేవేంద్రన్ 3, హెనిల్ పటేల్, ఖిలాన్ పటేల్ చెరో 2, కాన్షిక్ చౌహాన్ ఒక వికెట్ పడగొట్టారు.
ఇవీ చదవండి: