Ind Vs Pak U19 Asia Cup: టాస్ గెలిచిన టీమ్‌ఇండియా.. బ్యాటింగ్ ఎవరంటే?
ABN , Publish Date - Dec 21 , 2025 | 10:34 AM
కుర్రాళ్ల సమరానికి వేళైంది. దుబాయ్ వేదికగా భారత్, పాక్‌ల మధ్య జరుగుతున్న అండర్-19 ఆసియాకప్ ఫైనల్లో టాస్ గెలిచిన యంగ్ టీమ్‌ఇండియా బౌలింగ్ ఎంచుకుంది. తుది జట్లివే...
ఇంటర్నెట్ డెస్క్: అండర్-19 ఆసియా కప్(Under-19 Asia Cup) తుది సమరానికి సర్వం సిద్ధమైంది. దుబాయ్(Dubai) వేదికగా భారత్, పాకిస్థాన్(Ind Vs Pak)ల మధ్య జరుగుతున్న ఫైనల్లో టాస్ గెలిచిన యంగ్ టీమ్‌ఇండియా కెప్టెన్ ఆయుష్ మాత్రే(Ayush Mhatre) బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో పాక్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. సెమీఫైనల్లో శ్రీలంకపై ఆడిన జట్టులో ఎలాంటి మార్పులూ లేకుండానే బరిలోకి దిగుతోంది భారత్. మరోవైపు పాకిస్థాన్.. డానియాల్ అలీఖాన్ స్థానంలో నికాబ్ షఫీక్‌కు తుది జట్టులో అవకాశం కల్పించింది.
ఆసియాకప్ అండర్-19 టోర్నమెంట్‌లో భారత కుర్రాళ్ల టీమ్ ఇప్పటివరకూ ఓటమనేదే లేకుండా అజేయంగా దూసుకుపోతోంది. గ్రూప్ దశలో చిరకాల ప్రత్యర్థి పాక్‌ను కూడా మట్టికరిపించింది. అదే ఊపులో ఇప్పుడు దాయాది దేశంపై మరో విజయం సాధిస్తే.. రికార్డు స్థాయిలో తొమ్మిదో అండర్-19 ఆసియాకప్ భారత్ సొంతమవుతుంది.
భారత్ తుది జట్టు ఇదే:
ఆయుష్ మాత్రే(కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, ఆరోన్ జార్జ్, విహాన్ మల్హోత్రా, వేదాంత్ త్రివేది, అభిజ్ఞాన్ కుందు(వికెట్‌కీపర్), కాన్షిక్ చౌహాన్, హెనిల్ పటేల్, ఖిలాన్ పటేల్, దీపేశ్ దేవేంద్రన్, కిషన్ కుమార్ సింగ్
పాక్ తుది జట్టు ఇదే:
ఫర్హాన్ యూసఫ్ (కెప్టెన్), సమీర్ మిన్హాస్, ఉస్మాన్ ఖాన్, అహ్మద్ హుస్సేన్, హంజా జహూర్ (వికెట్‌కీపర్), హుజైఫా అహ్సన్, నికాబ్ షఫీక్, మహ్మద్ షయాన్, అలీ రజా, అబ్దుల్ సుభాన్, మహ్మద్ సయామ్
ఇవీ చదవండి: