Share News

T20 WC 2026: వేటు పడుతుందని గిల్‌కు ముందే తెలుసా?

ABN , Publish Date - Dec 21 , 2025 | 03:34 PM

టీ20 ప్రపంచ కప్ 2026కి సంబంధించి భారత జట్టును సెలక్టర్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో స్టార్ ప్లేయర్ శుభ్‌మన్ గిల్‌కు చోటు దక్కలేదు. అయితే ఈ విషయం గిల్‌కు ముందే ఫోన్ చేసి చెప్పినట్లు సమాచారం.

T20 WC 2026: వేటు పడుతుందని గిల్‌కు ముందే తెలుసా?
Shubman Gill

ఇంటర్నెట్ డెస్క్: శనివారం టీ20 ప్రపంచ కప్ 2026కి సంబంధించి భారత జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో స్టార్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్‌కు చోటు దక్కలేదు. ప్రస్తుత టీమిండియా టెస్ట్, వన్డే ఫార్మాట్‌ల కెప్టెన్, టీ20 వైస్ కెప్టెన్.. గిల్‌ను స్టాండ్ బైగా కూడా సెలక్టర్లు ఎంపిక చేయకపోవడం క్రికెట్ పండితులు కూడా ఊహించలేదు. గిల్ కూడా న్యూజిలాండ్ సిరీస్, ప్రపంచ కప్‌లో ఆడేందకు సన్నాహాలు సిద్ధం చేసుకుంటున్న వేళ బీసీసీఐ ఈ నిర్ణయాన్ని వెల్లడించింది. అయితే తనపై వేటు పడుతుందని గిల్‌(Shubman Gill)కు ముందే తెలుసు అన్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.


కుడి పాదానికి గాయం అవ్వడంతో సౌతాఫ్రికాతో జరిగిన చివరి రెండు టీ20లకు గిల్ జట్టులో లేడు. శనివారం అహ్మదాబాద్‌ను వీడి చండీగఢ్‌కు బయల్దేరిన సమయంలో సెలక్షన్ కమిటీ భేటీ జరిగింది. జట్టును ప్రకటించడానికి కొద్దిసేపటికి ముందే బీసీసీఐ నుంచి గిల్‌కి ఫోన్ వచ్చింది. తనను జట్టులోంచి తప్పించిన విషయాన్ని చెప్పారు. ఈ విషయాన్ని క్రిక్ బజ్ తన కథనంలో పేర్కొంది. అయితే గిల్‌కు ఎవరు ఈ విషయం గురించి చెప్పారనే అంశం మాత్రం బయటకు రాలేదు.


గిల్‌ తొలుత గాయంతోనే దక్షిణాఫ్రికాతో టీ20 ఆడేందుకు సిద్ధపడ్డాడు. కానీ మైదానంలోకి దిగితే అది మరింత తీవ్రమై కీలక టోర్నమెంట్లకు దూరం కావాల్సి వస్తుందని వైద్యులు హెచ్చరించడంతో వెనక్కి తగ్గాడు. ఆ తర్వాతే బీసీసీఐ కూడా అతడికి గాయమైన విషయాన్ని ధ్రువీకరించింది. లఖ్‌నవూలో డిసెంబర్‌ 16న నెట్‌ప్రాక్టీస్‌ సమయంలో గిల్ గాయపడ్డాడు. దీంతో జట్టులో ఆడేందుకు సంజుకు అవకాశం లభించింది.


ఇవీ చదవండి:

ఇషాన్‌కు ఇది క్రికెట్ ఇచ్చిన గిఫ్ట్: అశ్విన్

చెలరేగిన సమీర్ మిన్హాస్.. భారత్ టార్గెట్ 348

Updated Date - Dec 21 , 2025 | 03:41 PM