The Ashes: నాలుగో రోజు ముగిసిన ఆట
ABN , Publish Date - Dec 20 , 2025 | 01:22 PM
అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మూడో టెస్ట్ ఆడుతున్నాయి. నాలుగో రోజు ఆట ముగిసే సరికి ఇంగ్లండ్ ఆరు వికెట్లు నష్టపోయి 207 పరుగులు చేసింది. ఇంగ్లండ్ గెలుపుకి ఇంకా 228 పరుగులు కావాలి.
ఇంటర్నెట్ డెస్క్: యాషెస్ సిరీస్‌లో భాగంగా అడిలైడ్ వేదికగా మూడో టెస్టులో ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ తలపడుతున్నాయి. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 63 ఓవర్లకు ఆరు వికెట్లు నష్టపోయి 207 పరుగులు చేసింది. ఇంగ్లండ్ గెలుపుకి ఇంకా 228 పరుగులు కావాలి. 435 పరుగుల విజయ లక్ష్యంతో ఛేదనకు దిగిన ఇంగ్లండ్.. రెండో ఇన్నింగ్స్‌లో తడబడింది. ఆసీస్ బౌలర్ల ధాటికి ఇంగ్లండ్ బ్యాటర్లు పెవిలియన్‌కి క్యూ కట్టారు. ఆ టీమ్ గెలవాలంటే ఏదైనా అద్భుతం జరిగితే తప్పా అసాధ్యం.
ఇంగ్లండ్ బ్యాటర్లలో క్రాలీ(85) రాణించాడు. రూట్(39), బ్రూక్(30) పర్వాలేదనిపించారు. డకెట్(4), ఓలీ పోప్(17), స్టోక్స్(5), జెమీ స్మిత్(2), విల్ జాక్స్(11) తీవ్రంగా నిరాశపర్చారు. ఆసీస్ బౌలర్లో ప్యా్ట్ కమిన్స్, నాథన్ లైయన్ తలో మూడు వికెట్లు పడగొట్టి.. ఇంగ్లండ్ పతనాన్ని శాసించారు.
అంతకుముందు 271/4 ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్ 349 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ (170), వికెట్ కీపర్ అలెక్స్ కేరీ (72) రాణించారు. జోష్ ఇంగ్లిస్ (10), పాట్ కమిన్స్ (6), నాథన్ లైయన్ (0), స్కాట్ బోల్యాండ్ (1) స్వల్ప పరుగులకే వెనుదిరిగారు. మిచెల్ స్టార్క్ (7*) నాటౌట్‌గా నిలిచాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో జోష్ టంగ్ 4, బ్రైడన్ కార్స్ 3, జోఫ్రా ఆర్చర్, విల్‌జాక్స్, బెన్‌స్టోక్స్ తలో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
ఇవీ చదవండి:
ఓ ఆటగాడు గాయపడితే సంజూని ఆడిస్తారా?.. రవిశాస్త్రి తీవ్ర అసహనం
నేను కోలుకుంటున్నా.. త్వరలోనే మైదానంలోకి వస్తా: యశస్వి జైస్వాల్