SLW vs INDW: అలవోకగా బాదేశారు.. తొలి మ్యాచ్ టీమిండియాదే!
ABN , Publish Date - Dec 21 , 2025 | 10:09 PM
విశాఖపట్నం వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో టీమిండియా మహిళల జట్టు అలవోక విజయం సాధించింది. 122 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. 14.4 ఓవర్లలోనే ఛేదించింది.
ఇంటర్నెట్ డెస్క్: విశాఖపట్నం వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో టీమిండియా మహిళల జట్టు అలవోక విజయం సాధించింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. శ్రీలంక బ్యాటర్లను 121 పరుగులకే కట్టడి చేసింది. 122 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. 14.4 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో శ్రీలంకపై భారత మహిళల జట్టు తొలి మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. జెమీమా రోడ్రిగ్స్(69*) అర్ధ శతకంతో అదరగొట్టి అజేయంగా నిలిచింది. మరో ఎండ్‌లో కెప్టెన్ హర్మన్ ప్రీత్ (15*) నాటౌట్‌గా నిలిచింది. షెఫాలీ వర్మ(9), స్మృతి మంధాన(25) ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయారు. శ్రీలంక బౌలర్లలో కవింది, రణవీర చెరో వికెట్ తీశారు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక తడబడింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 121 పరుగులు చేసింది. ఓపెనర్ గుణరత్నే(39) టాప్ స్కోరర్. కెప్టెన్ చమరి ఆటపట్టు (15), హాసిని పెరీరా (20), హర్షిత (21) పర్వాలేదనిపించారు. భారత్ బౌలర్లలో క్రాంతి గౌడ్, దీప్తి శర్మ, శ్రీచరణి తలో వికెట్ తీశారు.
ఇవీ చదవండి:
తక్కువ మార్కులు వచ్చాయని చదువు మానేస్తామా?: సూర్య
పాక్ ప్లేయర్స్‌కి ‘షూ’ చూపించిన వైభవ్.. వీడియో వైరల్