Share News

SLW vs INDW: తడబడ్డ శ్రీలంక బ్యాటర్లు.. భారత్ టార్గెట్ 122

ABN , Publish Date - Dec 21 , 2025 | 09:25 PM

మహిళల ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా విశాఖపట్నం వేదికగా టీమిండియా-శ్రీలంక తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కి దిగిన శ్రీలంక.. నిర్ణీత 20 ఓవర్లకు 121 పరుగులకే పరిమితమైంది.

SLW vs INDW: తడబడ్డ శ్రీలంక బ్యాటర్లు.. భారత్ టార్గెట్ 122
SLW vs INDW

ఇంటర్నెట్ డెస్క్: ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా విశాఖపట్నం వేదికగా భారత్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో శ్రీలంక తడబడింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక.. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 121 పరుగులు చేసింది. ఓపెనర్ గుణరత్నే(39) టాప్ స్కోరర్. కెప్టెన్‌ చమరి ఆటపట్టు (15), హాసిని పెరీరా (20), హర్షిత (21) పర్వాలేదనిపించారు. భారత్‌ బౌలర్లలో క్రాంతి గౌడ్‌, దీప్తి శర్మ, శ్రీచరణి తలో వికెట్‌ తీశారు.


బ్యాటింగ్‌కి దిగిన శ్రీలంక జట్టుకు శుభారంభం దక్కలేదు. ఆదిలోనే కెప్టెన్ క్రాంతి గౌడ్‌‌కి చిక్కింది. 2.5వ బంతికి కెప్టెన్‌ చమరి ఆటపట్టు బౌల్డయ్యింది. వన్ డౌన్‌లో వచ్చిన హాసినితో కలిసి మరో ఓపెనర్‌ గుణరత్నే ఇన్నింగ్స్‌ నిర్మించే ప్రయత్నం చేసింది. అయితే జట్టు స్కోరు 49 పరుగుల వద్ద దీప్తి శర్మ వేసిన పదో ఓవర్‌ తొలి బంతికి భారీ షాట్‌కు ప్రయత్నించిన హాసిని.. క్రాంతి గౌడ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. ఆ తర్వాత వచ్చిన హర్షిత కూడా తక్కువ స్కోరుకే వెనుదిరిగింది.


ఒక్కొక్కరుగా పెవిలియన్‌ చేరుతున్నా.. గుణరత్నే మాత్రం క్రీజులో నిలదొక్కుకొని నిలకడగా పరుగులు రాబట్టింది. 18వ ఓవర్‌ చివరి బంతికి అనవసరంగా పరుగుకు ప్రయత్నించి.. రనౌట్‌గా పెవిలియన్‌కు చేరింది. చివర్లో వచ్చిన నీలాక్షి (8), కవీష (6) కూడా పెద్దగా రాణించలేదు. దీంతో శ్రీలంక 121 పరుగుల మోస్తరు స్కోరు మాత్రమే సాధించింది. కాగా ఈ ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు రనౌట్ రూపంలోనే కోల్పోవడం కొసమెరుపు.


ఇవీ చదవండి:

తక్కువ మార్కులు వచ్చాయని చదువు మానేస్తామా?: సూర్య

పాక్ ప్లేయర్స్‌కి ‘షూ’ చూపించిన వైభవ్.. వీడియో వైరల్

Updated Date - Dec 21 , 2025 | 09:25 PM