Share News

IndW Vs SLW: టాస్ గెలిచిన టీమిండియా.. బ్యాటింగ్ ఎవరిదంటే?

ABN , Publish Date - Dec 21 , 2025 | 07:05 PM

వన్డే ప్రపంచ కప్ గెలిచిన తర్వాత టీమిండియా తొలి పోరుకు సిద్ధమైంది. శ్రీలంకతో ఐదు టీ20లో భాగంగా నేడు తొలి మ్యాచ్ ఆడనుంది. టాస్ గెలిచిన భారత్.. ఫీల్డింగ్ ఎంచుకుంది.

IndW Vs SLW: టాస్ గెలిచిన టీమిండియా.. బ్యాటింగ్ ఎవరిదంటే?
IndW Vs SLW

ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచ కప్ గెలిచిన భారత మహిళల క్రికెట్ జట్టు.. ఆ టోర్నీ తర్వాత తొలి పోరుకు సిద్ధమైంది. శ్రీలంకతో ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా హర్మన్ సేన తొలి మ్యాచ్ ఆడనుంది. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌ జరగనున్న నేపథ్యంలో జట్టు కూర్పుపై అవగాహనకు రావడానికి ఈ సిరీస్‌ను ఉపయోగించుకోవాలని భారత్‌ భావిస్తోంది. అయితే టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత శ్రీలంక మహిళల జట్టు బ్యాటింగ్‌కి దిగనుంది.


బ్యాటింగ్‌లో హర్మన్‌ప్రీత్, స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, దీప్తిశర్మ మంచి ఫామ్‌లో ఉన్నారు. జట్టులోకి కొత్తగా వచ్చిన లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్నర్‌ వైష్ణవి శర్మ ఎలా ఆడతారో చూడాలి. అండర్‌-19 ప్రపంచకప్‌లో 17 వికెట్లు తీసిన వైష్ణవిపై మంచి అంచనాలున్నాయి. రాధ యాదవ్‌ గైర్హాజరీ నేపథ్యంలో వైష్ణవి కీలకం కానుంది.


భారత తుది జట్టు..

స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్ ప్రీత్ కౌర్(కెప్టెన్), రిచా ఘోష్(వికెట్ కీపర్), దీప్తి శర్మ, అమన్‌జోత్ కౌర్, అరుంధతీ రెడ్డి, వైష్ణవి శర్మ, క్రాంతి గౌడ్, శ్రీ చరణి.


శ్రీలంక తుది జట్టు..

విష్మి గుణరత్నే, చమరి అథాపత్తు(కెప్టెన్), హాసిని పెరెరా, హర్షిత సమర విక్రమ, నీలాక్షి డిసిల్వా, కౌషని నూత్యంగన(వికెట్ కీపర్), కవిషా దిల్హరి, మల్కీ మదార, ఇనోకా రణవీర, కావ్య కావింది, శశిని గిమ్హాని.


ఇవీ చదవండి:

తక్కువ మార్కులు వచ్చాయని చదువు మానేస్తామా?: సూర్య

పాక్ ప్లేయర్స్‌కి ‘షూ’ చూపించిన వైభవ్.. వీడియో వైరల్

Updated Date - Dec 21 , 2025 | 07:05 PM