Pro Kabaddi League Season-12: తుది అంకానికి చేరిన పీకేఎల్.. గెలుపెవరిదో?
ABN , Publish Date - Oct 25 , 2025 | 12:43 PM
ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 12 చివరి అంకానికి చేరుకుంది. రెండు నెలల పాటు ఉత్కంఠబరితంగా సాగిన కబడ్డీ.. అసలు సిసలు సమరానికి సిద్దమైంది. హోరాహోరి మ్యాచ్‌లతో లీగ్ దశ ముగియగా.. ఇవాళ (శనివారం) నుంచి ప్లే ఆఫ్స్ ప్రారంభం కానున్నాయి..
ప్రో కబడ్డీ లీగ్ సీజన్-12 చివరి అంకానికి చేరుకుంది. రెండు నెలల పాటు ఉత్కంఠబరితంగా సాగిన కబడ్డీ.. అసలు సిసలు సమరానికి సిద్దమైంది. హోరాహోరి మ్యాచ్‌లతో లీగ్ దశ ముగియగా.. ఇవాళ (శనివారం) నుంచి ప్లే ఆఫ్స్ ప్రారంభం కానున్నాయి. మొత్తం 12 జట్లు ఈ సీజన్‌లో తలపడగా.. ఎనిమిది జట్లు తర్వాతి దశకు అర్హత సాధించాయి. గతంలో కంటే భిన్నంగా కొనసాగుతున్న ఈ సీజన్‌లో టాప్-4లో నిలిచిన జట్లు నేరుగా క్వాలిఫయర్ ఆడనున్నాయి. తర్వాతి నాలుగు జట్లు ప్లే ఇన్ మ్యాచ్‌లు ఆడతాయి.
పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన పుణేరి పల్టన్, దబంగ్ ఢిల్లీ మధ్య క్వాలిఫయర్-1 జరగనుంది. ఇందులో గెలిచిన టీమ్ నేరుగా ఫైనల్ చేరుతుంది. ఓడిన జట్టుకు క్వాలిఫయర్-2లో మరో అవకాశం దక్కుతుంది. ఐదు, ఎనిమిది స్థానాల్లో నిలిచిన జట్లకు.. ఆరు, ఏడు స్థానాలు దక్కించుకున్న జట్లకు మధ్య ప్లే ఇన్ మ్యాచ్‌లు జరుగుతాయి.
ప్లే ఇన్ మ్యాచ్ విజేతలు ఎలిమినేటర్-1 ఆడతారు. 3, 4 స్థానాల్లో నిలిచిన జట్లు మినీ క్వాలిఫయర్ ఆడతాయి. ఓడిన జట్టు ఎలిమినేటర్-2 ఆడుతుంది. ఎలిమినేటర్-3 విజేత క్వాలిఫయర్-2లో తలపడతుంది. అందులో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ చేరుతుంది.
తెలుగు టైటాన్స్ ఫైనల్ చేరాలంటే?
పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచిన తెలుగు టైటాన్స్(Telugu Titans) మినీ క్వాలిఫయర్ ఆడనుంది. ఇందులో గెలిస్తే ఎలిమినేటర్-3కి అర్హత సాధిస్తుంది. ఈ మ్యాచ్‌లో ఎలిమినేటర్-2 విజేతతో తలపడతుంది. ఈ మ్యాచ్‌లో కూడా గెలిస్తేనే క్వాలిఫయర్-2కు అర్హత సాధిస్తుంది. తర్వాత క్వాలిఫయర్-1లో ఓడిన జట్టుతో తలపడి గెలిస్తే ఫైనల్ చేరుతుంది. కాగా ఈ సీజన్‌లో అద్భుత ప్రదర్శన చేసిన తెలుగు టైటాన్స్ 18 మ్యాచ్‌ల్లో 10 విజయాలు సాధించింది.
ఇవి కూడా చదవండి..
IND VS AUS: రెండో వన్డేలోనూ భారత్ ఓటమి
Virat Kohli Emotional: అడిలైడ్ మ్యాచ్‌లో భావోద్వేగానికి గురైన విరాట్ కోహ్లీ