Share News

Mohammad Siraj: సహచర ప్లేయర్లకు టీమిండియా పేసర్ సిరాజ్ అదిరిపోయే ఆతిథ్యం

ABN , Publish Date - Dec 06 , 2025 | 01:00 PM

భారత ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ తన సహచర ప్లేయర్లు మహమ్మద్ షమీ, ముఖేష్ కుమార్, ఆకాష్ దీప్ తో పాటు బెంగాల్ జట్టులోని ఇతర సభ్యులకు హైదరాబాద్‌లోని తన రెస్టారెంట్‌లో ఆతిథ్యం ఇచ్చాడు. ఈ నేపథ్యంలో సిరాజ్ కు ధన్యవాదాలు తెలుపుతూ టీమిండియా బౌలర్ మహమ్మద్ షమీ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.

 Mohammad Siraj: సహచర ప్లేయర్లకు టీమిండియా పేసర్ సిరాజ్ అదిరిపోయే ఆతిథ్యం
Mohammad Siraj

ఇంటర్నెట్ డెస్క్: భారత ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్(Mohammad Siraj) తన సహచర ప్లేయర్లు మహమ్మద్ షమీ, ముఖేష్ కుమార్, ఆకాష్ దీప్ తో పాటు బెంగాల్ జట్టులోని ఇతర సభ్యులకు హైదరాబాద్‌లోని తన రెస్టారెంట్‌లో ఆతిథ్యం ఇచ్చాడు. సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ (SMAT) టీ20 టోర్నీలో భాగంగా డిసెంబర్ 6న పుదుచ్చేరితో జరిగే మ్యాచ్‌ కోసం బెంగాల్ ఆటగాళ్లు హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా హైదరాబాదీ ప్లేయర్ సిరాజ్.. వారికి ప్రత్యేక విందును ఏర్పాటు చేశాడు. ఆటకు ముందు, బెంగాల్ జట్టు సభ్యులు సిరాజ్ రెస్టారెంట్‌లో విందులో మునిగిపోయారు. టీమిండియా బౌలర్ మహమ్మద్ షమీ తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో మీట్-అప్ నుండి ఫోటోలను పంచుకున్నారు. అంతేకాక తమకు ఆతిథ్యం ఇచ్చినందుకు సిరాజ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.


'మహమ్మద్ సిరాజ్ నన్ను, ఇతర సహచరులను తన రెస్టారెంట్‌కు ఆహ్వానించాడు. ఇది మా స్నేహాన్ని బలోపేతం చేయడానికి ఒక అద్భుతమైన మార్గం. మేము కలిసి మంచి భోజనాన్ని ఆస్వాదించాము. మైదానంలో, వెలుపల మా అనుభవాలతో షేర్ చేసుకుంటూ సరదగా గడిపాము. ఇదే బంధాన్ని బలంగా ఏర్పరుచుకుంటాము. చాలా మంచి ఆతిథ్యం ఇచ్చిన సిరాజ్ కు ధన్యవాదాలు' అని షమీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇక సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ(Syed Mushtaq Ali Trophy) 2025 సీజన్‌లో సిరాజ్ ఒకే ఒక్క మ్యాచ్‌లో మాత్రమే ఆడాడు. ఉత్తరప్రదేశ్ తో జరిగిన మ్యాచ్ లో నాలుగు ఓవర్లలో 1/15 వికెట్లు తీసుకున్నాడు.


ఆ మ్యాచ్ లో హైదరాబాద్ ఉత్తరప్రదేశ్‌పై మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ కుడిచేతి వాటం సీమర్ దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ లో భారత జట్టులో లేడు. సౌతాఫ్రికాతో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ తర్వాత అతనికి విశ్రాంతి లభించింది. మరోవైపు టీమిండియా పేసర్ మహమ్మద్ షమీ(Mohammed Shami) కొంతకాలంగా జాతీయజట్టుకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో షమీ అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. ఇప్పటి వరకు ఈ టోర్నీలో అతడు 19.44 యావరేజ్‌తో ఇప్పటివరకు 9 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. 4/13 అత్యుత్తమ ప్రదర్శన చేశాడు.


ఈ వార్తలు కూడా చదవండి..

Seema Punia: సీమా పునియాకు భారీ షాక్.. 16 నెలల నిషేధం

ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్.. షఫాలీ వర్మ నామినేట్

Updated Date - Dec 06 , 2025 | 01:11 PM