Mitchell Starc Fastest Ball: చిన్న మిస్టేక్.. మిచెల్ స్టార్క్ వరల్డ్ రికార్డ్!
ABN , Publish Date - Oct 19 , 2025 | 03:46 PM
భారత్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ పెర్త్ తో జరుగుతోంది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ దిగిన భారత్ నిర్ణీత 26 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 136 పరుగులు చేసింది. ఇది ఇలా ఉంటే ఆసీస్ బౌలింగ్ సమయంలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.
భారత్ ఆస్ట్రేలియా( IND vs AUS ) మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ పెర్త్ తో జరుగుతోంది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ దిగిన భారత్ నిర్ణీత 26 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 136 పరుగులు చేసింది. చివర్లో తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డి (11 బంతుల్లో 19 పరుగులు)రెండు సిక్స్ కొట్టడం భారత్ పరువు దక్కినట్లు అయింది. వర్షం కారణంగా పలుమార్లు మ్యాచ్ కు అంతరాయం ఏర్పడింది. ఇది ఇలా ఉంటే ఆసీస్(Australia) బౌలింగ్ సమయంలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.
భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్‌లో బ్రాడ్‌కాస్టర్ తప్పిదం కారణంగా.. అంతర్జాతీయ క్రికెట్‌లోనే అత్యంత వేగవంతమైన బంతిని వేసిన బౌలర్‌గా ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్(Mitchell Starc) నిలిచాడు. ప్రపంచంలో ఫాస్టెస్ట్ బాల్ రికార్డ్ పాకిస్థాన్ దిగ్గజ పేసర్ షోయబ్ అక్తర్(Shoaib Akhtar record) పేరిట ఉన్న సంగతి తెలిసిందే. అయితే బ్రాడ్‌కాస్టర్ తప్పిదం కారణంగా ఈ ఫీట్‌ను తాజా వన్డేలో మిచెల్ స్టార్క్ అధిగమించినట్లు నెట్టింట్లో జోరుగా చర్చ సాగుతోంది. తొలి వన్డేలో తొలి బంతినే మిచెల్ స్టార్క్ గంటకు 176.5 కిలోమీటర్ల వేగంతో సంధించినట్లు బ్రాడ్ కాస్టర్ చూపించింది. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.
సాధారణంగా మిచెల్ స్టార్క్(Mitchell Starc) గంటలకు 140 ప్లస్ కిలోమీటర్ల వేగంతో బంతులు సంధిస్తాడు. కానీ బ్రాడ్‌కాస్టర్ మాత్రం స్టార్క్ డెలివరీ స్పీడ్‌ను 176.5 కేపీహెచ్‌గా చూపించడంతో అంతా షాకయ్యారు. కానీ అది స్పీడ్ గన్ తప్పిదం కారణంగా ఇలా చూపించారని తేలడంతో నెటిజన్లు సెటైర్లు పేల్చుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూ.. బ్రాడ్ కాస్టర్ తప్పిదం కారణంగా ఫాస్టెస్ట్ బౌలర్‌గా స్టార్క్(Starc) అంటూ సెటైర్లు పేల్చుతున్నారు. అయితే మిచెల్ వరల్డ్ రికార్డు నెటిజన్ల సెటైర్లుగా వచ్చిందే కానీ..అధికారికంగా ప్రకటించింది కాదు.
ఇవి కూడా చదవండి..
దీపావళి వేళ.. ఢిల్లీలో ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం