KTR on party defections: పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టుకు వెళ్తాం: కేటీఆర్
ABN , Publish Date - Oct 19 , 2025 | 01:46 PM
కాంగ్రెస్‌ను బీఆర్ఎస్ మొదటి దెబ్బ జూబ్లీహిల్స్ లో కొట్టబోతోందని కేటీఆర్ స్పష్టం చేశారు. రెండో దెబ్బ రాజేంద్రనగర్ లేదా ఖైరతాబాద్‌లో కొడుతామని తేల్చి చెప్పారు. కడియం శ్రీహరి ఏ పార్టీలో ఉన్నాడో చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాడని మండిపడ్డారు.
ఇంటర్నెట్ డెస్క్, అక్టోబర్ 19: ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టుకు వెళ్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మరోసారి స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆదివారం నాడు రాజేంద్రనగర్ నియోజకవర్గం నుంచి పలువురు బీఆర్ఎస్‌లో చేరారు. వీరిని కేటీఆర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ను మొదటి దెబ్బ జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ (BRS) కొట్టబోతుందని స్పష్టం చేశారు.
రెండో దెబ్బ రాజేంద్రనగర్ లేదా ఖైరతాబాద్‌లో కొడుతామని తేల్చి చెప్పారు. కడియం శ్రీహరి (Kadiyam Srihari) ఏ పార్టీలో ఉన్నాడో చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాడని మండిపడ్డారు. దమ్ముంటే కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నికకు రావాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఫిరాయింపు ఎమ్మెల్యేల స్థానాల్లో ఉపఎన్నికలు (By-elections) తథ్యమని స్పష్టం చేశారు. రెండేళ్ల తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి రాబోతుందని.. కేటీఆర్ (KTR) మళ్లీ ముఖ్యమంత్రి కాబోతున్నాడని ధీమా వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం ఏర్పడ్డాక ఎవరెవర్ని ఏం చేయాలో, ఎవరి బెండ్ ఎలా తీయాలో తీసి తీరుతామని హెచ్చరించారు. ఎవరెవరు ఏం చేస్తున్నారన్న అందరి జాతకాలు తనకు తెలుసని.. లెక్కలన్నీ తేలుస్తామని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి:
Food Safety Violation: అల్పాహారంలో పురుగులు.. హోటల్ యజమాన్యానికి షాక్ ఇచ్చిన అధికారులు
Katta Ramachandra Reddy funeral: మావోయిస్టు నేత కట్టా రామచంద్రారెడ్డి అంత్యక్రియలు పూర్తి