Food Safety Violation: అల్పాహారంలో పురుగులు.. హోటల్ యజమాన్యానికి షాక్ ఇచ్చిన అధికారులు
ABN , Publish Date - Oct 19 , 2025 | 01:11 PM
రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండలం బండ్లగూడలో కస్టమర్‌కు హోటల్ యజమాన్యం గట్టి షాక్ ఇచ్చింది.
హైదరాబాద్, అక్టోబర్ 19: రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండలం బండ్లగూడలో కస్టమర్‌కు హోటల్ యజమాన్యం గట్టి షాక్ ఇచ్చింది. ఆహార పదార్థాలు సరఫరా చేస్తూ.. పురుగులున్న బొండాలను కస్టమర్‌కు హోటల్ సిబ్బంది సరఫరా చేశారు. టిఫిన్ తింటున్న సమయంలో వాటిలో పురుగులు ఉండడంతో.. హోటల్ యాజమాన్యాన్ని కస్టమర్ ప్రశ్నించాడు. వారు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. దీంతో ఫుడ్ సేఫ్టీ అధికారులకు అతడు ఫిర్యాదు చేశాడు. ఆ అధికారులు సదరు హోటల్ వద్దకు చేరుకుని.. సిబ్బంది సరఫరా చేసిన ఆహార పదార్థాలను పరిశీలించారు.
అనంతరం హోటల్‌లో తనిఖీలు నిర్వహించారు. హోటల్ అపరిశుభ్రంగా ఉండడంతో.. ఆ యాజమాన్యానికి రూ. 10 వేలు ఫైన్‌ను అధికారులు వేశారు. అయితే పరిసర ప్రాంతాల్లోని హోటళ్లలో తనిఖీలు జరగడం లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో హోటళ్ల యాజమాన్యం ఇష్టారీతిగా వ్యవహరించడమే కాకుండా.. అధిక ధరలు సైతం వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో నిరంతరం తనిఖీలు నిర్వహించాలని ఈ సందర్భంగా ఫుడ్ సేఫ్టీ అధికారులను స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
చివరి నిమిషంలో ప్రయాణికులకు ఎయిర్ ఇండియా షాక్
బంద్ వేళ దాడులు.. ఎనిమిది మంది అరెస్ట్
For More TG News And Telugu News