Air India: చివరి నిమిషంలో ప్రయాణికులకు ఎయిర్ ఇండియా షాక్
ABN , Publish Date - Oct 19 , 2025 | 12:43 PM
అహ్మదాబాద్ ఘటన నాటి నుంచి ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ ప్రయాణికులకు వరుసగా షాక్‌లు ఇస్తుంది. తాజాగా మరోసారి ప్రయాణికులకు గట్టి ఝలక్ ఇచ్చింది.
మిలాన్, అక్టోబర్ 19: స్వదేశానికి వెళ్లి తమ వారితో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొనాలని వారంతా భావించారు. అందుకోసం వారంతా ముందుగానే విమాన టికెట్లు సైతం బుక్ చేసుకున్నారు. ఈ ప్రయాణానికి కొన్ని గంటల ముందు భారత్ వెళ్లే విమాన సర్వీస్ రద్దు చేసినట్లు ఎయిర్ ఇండియా సంస్థ ప్రకటించింది. దీంతో భారత్ వెళ్లి తమ కుటుంబ సభ్యులతో దీపావళి వేడుకలు చేసుకోవాలనుకున్న వారి ఆశలపై ఎయిర్ ఇండియా సంస్థ నీళ్లు జల్లినట్లు అయింది.
అక్టోబర్ 17వ తేదీన ఇటలీలోని మిలాన్ నగరం నుంచి 256 మంది ప్రయాణికులు, 10 మంది సిబ్బందితో ఏఐ 138 విమాన సర్వీసు న్యూఢిల్లీకి బయలుదేరాల్సి ఉంది. చివరి నిమిషంలో.. ఈ విమాన సర్వీసును రద్దు చేస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. దీనిపై ఎయిర్ ఇండియా స్పందించింది. విమానంలో సాంకేతిక సమస్య ఏర్పడిందని తెలిపిందే.
ప్రయాణికులు, విమాన సంస్థ సిబ్బందికి భద్రత కల్పించడానికే తాము తొలి ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేసింది. అందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. అయితే ఇటలీలోని మిలాన్ నుంచి భారత్ రాజధాని న్యూఢిల్లీ వెళ్లే విమాన సర్వీస్ సోమవారం లేదా మంగళవారం ఉంటుందని పేర్కొంది. ఈ సర్వీసుకు టికెట్ బుక్ చేసుకో వచ్చని ప్రయాణికులకు ఎయిర్ ఇండియా సంస్థ సూచించింది. అప్పటి వరకు ఈ విమాన ప్రయాణికులు ఉండేందుకు స్థానిక ఎయిర్ పోర్ట్ సమీపంలో హోటల్ వసతి సౌకర్యాన్ని కల్పించామని ఎయిర్ ఇండియా సంస్థ వెల్లడించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
బంద్ వేళ దాడులు.. ఎనిమిది మంది అరెస్ట్
చెక్‌పోస్టులపై ఏసీబీ దాడులు.. భారీగా నగదు స్వాధీనం
For More National News And Telugu News