BC Bandh Attack In Hyderabad: బంద్ వేళ దాడులు.. ఎనిమిది మంది అరెస్ట్
ABN , Publish Date - Oct 19 , 2025 | 11:51 AM
స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ.. బీసీ జేఏసీ శనివారం బంద్‌కు పిలుపు నిచ్చింది. ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి.
హైదరాబాద్, అక్టోబర్ 19: స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాల ఐక్య వేదిక(బీసీ జేఏసీ) శనివారం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ బంద్ దాదాపుగా ప్రశాంతంగా జరిగినా.. కొన్ని ప్రాంతాల్లో మాత్రం హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. అందుకు కారణమైన ఎనిమిది మందిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఈ దాడులకు పాల్పడిన వారిపై నల్లకుంట, కాచిగూడ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.
బీసీ బంద్ నేపథ్యంలో విద్యానగర్ నుంచి బర్కత్‌పూర వరకు బీసీ జేఏసీ నేతలు ర్యాలీగా తరలి వచ్చారు. ఆ క్రమంలో ఈ మార్గంలో తెరిచి ఉంచిన పలు షాపులు, పోరూంలతోపాటు పెట్రోల్ బంక్‌పై దాడులు చేశారు. దీంతో బాధితలు పోలీసులను ఆశ్రయించారు. వీరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అందులో భాగంగా ఆ పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరా ఫుటేజ్‌లను పోలీసులు పరిశీలించి.. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా శనివారం అర్థరాత్రి ఈ హింసాత్మక సంఘటనలకు బాధ్యులను పోలీసులు అరెస్ట్ చేసి.. రిమాండ్‌కు తరలించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
చెక్‌పోస్టులపై ఏసీబీ దాడులు.. భారీగా నగదు స్వాధీనం
మద్యం దుకాణాల దరఖాస్తులపై ప్రభుత్వం కీలక నిర్ణయం
For More TG News And Telugu News