Share News

Team India: పెరిగిపోయిన అమ్మాయిల బ్రాండ్ వాల్యూ!

ABN , Publish Date - Nov 04 , 2025 | 01:53 PM

ప్రపంచకప్ గెలుపుతో భారత మహిళా క్రికెటర్ల బ్రాండ్ వాల్యూ అమాంతం పెరిగిపోయింది. హర్మన్ ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్‌ల ఫాలోయింగ్ కూడా భారీగా పెరిగింది.

Team India: పెరిగిపోయిన అమ్మాయిల బ్రాండ్ వాల్యూ!

ఇంటర్నెట్ డెస్క్: దశాబ్దాల నిరీక్షణకు తెర దించుతూ భారత మహిళా జట్టు ఐసీసీ వన్డే ప్రపంచ కప్‌లో విజయం సాధించింది. ఫైనల్‌లో సౌతాఫ్రికాను చిత్తు చేసి విశ్వవిజేత( Women’s World Cup 2025)గా నిలిచింది. ఈ గెలుపుతో టీమిండియా మహిళా క్రికెటర్ల(Indian women cricketers) బ్రాండ్ వాల్యూ అమాంతం పెరిగిపోయింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ తదితరుల సోషల్ మీడియా అకౌంట్లకు ఒక్కసారిగా ఫాలోవర్లు పెరిగిపోయారు.


25% నుంచి 100% వరకు..

ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌లో కప్‌ను ముద్దాడిన మరుక్షణం నుంచే.. ప్లేయర్ల బ్రాండ్ వాల్యూ అమాంతం పెరిగిపోయింది. కొత్త ఎండార్స్‌మెంట్లే కాకుండా.. పాత వాటి పెంపు విషయమై కూడా చర్చలు జరిగినట్లు సమాచారం. జెమీమా రోడ్రిగ్స్(Jemimah Rodrigues).. రెండో సెమీస్‌లో బలమైన ఆస్ట్రేలియాను ఓడించడంలో కీలక పాత్ర పోషించింది. 127 పరుగులతో అజేయమైన సెంచరీ చేసి నాటౌట్‌గా నిలిచింది. చివరి వరకు క్రీజులో నిలబడి జట్టును ఫైనల్‌కు చేర్చింది. ప్రస్తుతం ఆమె బ్రాండ్ వాల్యూ 100శాతం వరకు పెరిగినట్లు తెలుస్తోంది. జెమీమా బ్రాండ్ ఎండార్స్‌మెంట్ ఫీజు.. రూ.75లక్షల నుంచి రూ.1.5కోట్ల వరకు ఛార్జ్ చేస్తున్నట్లు సమాచారం. జెమీమా రెడ్ బుల్, బోట్, సర్ఫ్ ఎక్సెల్‌కు ప్రచారకర్తగా వ్యవహరిస్తోంది.


16 బ్రాండ్‌లకు..

స్మృతి మంధాన(Smriti Mandhana).. దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న మహిళా క్రికెటర్. ఇప్పటికే స్మృతి.. రెక్సోనా, డియోడ్రెంట్, నైక్, హ్యాండాయ్, హెర్బాలైట్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI), గల్ఫ్ ఆయిల్, పీఎన్‌బీ(PNB) మెట్‌లైఫ్ ఇన్సూరెన్స్ వంటి 16 బ్రాండ్‌లకు ప్రచారకర్తగా వ్యవహరిస్తోంది. వీటి ద్వారా ఆమె ఒక్కో బ్రాండ్‌కు రూ.1.5కోట్ల నుంచి రూ.2కోట్ల వరకు సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి:

Laura Wolvaardt: షెఫాలీ బౌలింగ్‌కు షాకయ్యాం: లారా

Shree Charani: ప్రపంచ కప్‌లో కడప బిడ్డ!

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 04 , 2025 | 01:53 PM