Home » Women Asia Cup
ప్రపంచకప్ గెలుపుతో భారత మహిళా క్రికెటర్ల బ్రాండ్ వాల్యూ అమాంతం పెరిగిపోయింది. హర్మన్ ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్‌ల ఫాలోయింగ్ కూడా భారీగా పెరిగింది.
ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన చేసిన షెఫాలీ వర్మకు కెప్టెన్సీ రూపంలో కొత్త అధ్యాయం మొదలైంది. సీనియర్ మహిళల ఇంటర్-జోనల్ టీ20 ట్రోఫీలో నార్త్ జోన్ కెప్టెన్‌గా నియమించారు.
మహిళా ప్రపంచకప్ విజయం సందర్భంగా టీమిండియా విక్టరీ పరేడ్‌పై ఇంకా నిర్ణయం తీసుకోలేదని బీసీసీఐ సెక్రటరీ దేవ్‌జిత్ సైకియా తెలిపారు. ఐసీసీ సమావేశాల తర్వాత దీనిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలోని టీమిండియా తొలి సారిగా ఐసీసీ ప్రపంచకప్‌ను ముద్దాడింది. ఈ నేపథ్యంలో భారత మాజీ కెప్టెన్, దిగ్గజ మహిళా మాజీ క్రికెటర్ డయానా ఎడుల్జీ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ భావోద్వేగానికి గురయ్యారు.
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 ఫైనల్ పోరుకు టీమిండియా సన్నద్ధమైంది. నవీ ముంబై వేదికగా భారత్-సౌతాఫ్రికా తలపడనున్నాయి. ఈ హై ఓల్టేజ్ మ్యాచ్‌కు ముందు భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ చేసిన కామెంట్స్ కోట్లాది మంది అభిమానుల ఆశలను పెంచేలా ఉన్నాయి.
ఐసీసీ మహిళల ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌కు ఇంకా కొన్ని గంటల సమయమే ఉంది. నవీ ముంబై వేదకగా టీమిండియా-సౌతాఫ్రికా ఈ పోరులో తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్ట్ సంచలన వ్యాఖ్యలు చేసింది.
మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 చివరి అంకానికి చేరుకుంది. ఆదివారం నవీ ముంబై వేదికగా జరగనున్న ఫైనల్‌తో ఈ మెగా టోర్నీకి తెరపడనుంది. ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. వర్షం వల్ల ఆదివారం కనీసం 20 ఓవర్ల ఆట సాధ్యం కాకపోతే సోమవారానికి రిజర్వ్ డే ప్రకటిస్తారు.
ఐసీసీ వన్డే మహిళల ప్రపంచ కప్ 2025 సెమీస్‌లో టీమిండియా చరిత్రలో నిలిచిపోయే విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలో టీమిండియా ప్రపంచ రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. ఆసీస్ ఓటమి పాలైనప్పటికీ ఆ జట్టు బ్యాటర్ లిచ్‌ఫీల్డ్ సెంచరీ చేసి రికార్డు సృష్టించింది.
మహిళల వన్డే ప్రపంచ కప్‌లో భాగంగా రెండో సెమీ ఫైనల్‌లో టీమిండియా-ఆస్ట్రేలియా తలపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ 49.5 ఓవర్లలో 338 పరుగులు చేసి ఆలౌటైంది. దీంతో టీమిండియాకు 339 పరుగుల భారీ టార్గెట్‌ను ఆసీస్ నిర్దేశించింది.
ప్రస్తుతం మహిళల వన్డే ప్రపంచ కప్ సెమీస్ దశకు చేరుకుంది. అక్టోబర్ 29,30 తేదీల్లో రెండు సెమీ ఫైనల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. అందులో ఒకటి నవీ ముంబై, మరోటి గౌహతి వేదికగా జరుగుతాయి. కాగా నవంబర్ 2న ఫైనల్ మ్యాచ్ కూడా ఇక్కడే జరుగుతుండటంతో పోలీసులు కట్టుదిట్టంగా భద్రతా చర్యలు చేపట్టారు.