Womens World Cup 2025: వేధింపుల ఘటన.. నవీ ముంబైలో భారీగా భద్రతా ఏర్పాట్లు
ABN , Publish Date - Oct 27 , 2025 | 02:05 PM
ప్రస్తుతం మహిళల వన్డే ప్రపంచ కప్ సెమీస్ దశకు చేరుకుంది. అక్టోబర్ 29,30 తేదీల్లో రెండు సెమీ ఫైనల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. అందులో ఒకటి నవీ ముంబై, మరోటి గౌహతి వేదికగా జరుగుతాయి. కాగా నవంబర్ 2న ఫైనల్ మ్యాచ్ కూడా ఇక్కడే జరుగుతుండటంతో పోలీసులు కట్టుదిట్టంగా భద్రతా చర్యలు చేపట్టారు.
ఆస్ట్రేలియాకు చెందిన మహిళా క్రికెటర్లపై నాలుగు రోజుల క్రితం ఓ వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించిన విషయం తెలిసిందే. మహిళల వన్డే ప్రపంచ కప్‌లో భాగంగా సౌతాఫ్రికాతో మ్యాచ్ సందర్భంగా ఇండౌర్‌కు వచ్చిన మహిళా క్రికెటర్లు కేఫే కోసం బయటకు వెళ్తుండగా ఓ ఆకతాయి బైక్‌పై ఇద్దరిని వెంబడిస్తూ అసభ్యకరంగా ప్రవర్తించాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో మాజీ క్రికెటర్లు ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. నిందితుడికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రస్తుతం మహిళల వన్డే ప్రపంచ కప్ సెమీస్ దశకు చేరుకుంది. అక్టోబర్ 29,30 తేదీల్లో రెండు సెమీ ఫైనల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. అందులో ఒకటి నవీ ముంబై, మరోటి గౌహతి వేదికగా జరుగుతాయి. కాగా నవంబర్ 2న ఫైనల్ మ్యాచ్ కూడా ఇక్కడే జరుగుతుండటంతో పోలీసులు కట్టుదిట్టంగా భద్రతా చర్యలు చేపట్టారు. ఈ మేరకు తమ ఏర్పాట్ల గురించి మహారాష్ట్ర పోలీస్ అధికారి వివరాలను వెల్లడించారు.
‘కేవలం మ్యాచ్‌లు ఉన్నప్పుడే మాత్రమే కాదు.. ప్రపంచ కప్ ఆరంభం నుంచే సెక్యూరిటీని కట్టుదిట్టం చేశాం. మహిళా క్రికెటర్లు ఉన్న హోటల్స్ వద్ద గార్డులను నియమించాం. వారు మైదానం నుంచి హోటళ్ల గదికి వెళ్లేటప్పుడు ఎస్కార్ట్ కేటాయించాం. గ్రౌండ్ వద్ద కూడా 600 మందిని ఉంచాం. అందులో 75 మంది అధికారులు కాగా మిగిలిన వారంతా కానిస్టేబుళ్లు. ఎవరైనా ప్లేయర్ బయటకు వెళ్లాలని అనుకున్నప్పుడు మాకు సమాచారం అందిస్తే రక్షణ కల్పించేందుకు సిద్ధంగా ఉన్నాం. ఈ ఘటన జరిగిందనే కాకుండా.. ఆటగాళ్ల విషయంలో జాగ్రత్తలు పాటించాం. అయితే కొందరు మాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే బయటకు వెళ్తున్నారు. అప్పుడే సమస్యలు ఎదురవుతున్నాయి. అలా కాకుండా ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే మాకు ఆ విషయం చెబితే భద్రత విషయం మేం చూసుకుంటాం’ అని మహారాష్ట్ర పోలీసుల అధికారి తెలిపారు. మరోవైపు అక్టోబర్ 30న ఆసీస్‌తోనే టీమిండియా రెండో సెమీస్‌లో తలపడనుంది.
ఇవి కూడా చదవండి
2027 వరల్డ్ కప్.. రో-కో జోడీ ఫిక్స్: గావస్కర్
సెలెక్టర్లపై అసంతృప్తి వ్యక్తం చేసిన రహానే!
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి