Share News

IND w Vs AUS w: టీమిండియా ప్రపంచ రికార్డులివే..!

ABN , Publish Date - Oct 31 , 2025 | 12:35 PM

ఐసీసీ వన్డే మహిళల ప్రపంచ కప్ 2025 సెమీస్‌లో టీమిండియా చరిత్రలో నిలిచిపోయే విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలో టీమిండియా ప్రపంచ రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. ఆసీస్ ఓటమి పాలైనప్పటికీ ఆ జట్టు బ్యాటర్ లిచ్‌ఫీల్డ్ సెంచరీ చేసి రికార్డు సృష్టించింది.

IND w Vs AUS w: టీమిండియా ప్రపంచ రికార్డులివే..!

ఐసీసీ వన్డే మహిళల ప్రపంచ కప్ 2025(ICC Women’s World Cup 2025) సెమీస్‌లో టీమిండియా చరిత్రలో నిలిచిపోయే విజయాన్ని సొంతం చేసుకుంది. ఏకంగా ఏడు సార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన ప్రత్యర్థి ఆస్ట్రేలియాను నాకౌట్ దశలోనే ఓడించడం అంటే దాదాపు కప్‌ను అందుకున్నట్లే. అది కూడా 339 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడం మామూలు విషయం కాదు. రెండో సెమీస్‌లో ఆస్ట్రేలియా(India vs Australia Women)ను చిత్తు చేసి టీమిండియా ఫైనల్‌కు దూసుకెళ్లింది. జెమీమా(127*) సూపర్ సెంచరీ, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(89) హాఫ్ సెంచరీతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలో టీమిండియా ప్రపంచ రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. ఆసీస్ ఓటమి పాలైనప్పటికీ ఆ జట్టు బ్యాటర్ లిచ్‌ఫీల్డ్ సెంచరీ చేసి రికార్డు సృష్టించింది.


రికార్డులివే..!

  • మహిళల ప్రపంచ కప్‌లో ఓ మ్యాచ్‌లో అత్యధికంగా సిక్స్‌లు నమోదు కావడం ఇదే తొలిసారి. మ్యాచ్‌లో ఇరు జట్ల ప్లేయర్లు కలిసి 14 సిక్స్‌లు కొట్టారు. ఇందులో టీమిండియావి ఐదు కాగా.. ఆసీస్ బ్యాటర్లు తొమ్మిది సిక్స్‌లు బాదారు.

  • ప్రపంచ కప్ నాకౌట్ దశలో 300కి పైగా కంటే లక్ష్యాన్ని ఛేదించడం ఇదే తొలిసారి. పురుషుల, మహిళల క్రికెట్‌లో ఇదే రికార్డు.

  • మహిళల వన్డే చరిత్రలోనే అత్యధిక లక్ష్య ఛేదన(339) జట్టుగా టీమిండియా నిలిచింది. ఇంతకు ముందు వరకు ఈ రికార్డు ఆసీస్‌పైనే ఉండేది. అది కూడా భారత్‌పై ఇదే వరల్డ్ కప్ లీగ్ స్టేజ్‌లో(331) ఛేదించింది.

  • భారత్, ఆస్ట్రేలియా కలిసి ఈ మ్యాచ్‌లో 679 పరుగులు చేశాయి. వన్డే వరల్డ్ కప్ చరిత్రలోనే అత్యధిక స్కోరు నమోదైన మ్యాచ్ ఇదే. ఇంతకు ముందు 2017లో ఇంగ్లండ్-సౌతాఫ్రికా 678 పరుగులు నమోదు చేశాయి.

  • ఆస్ట్రేలియా ఓపెనర్ ఫోబ్ లిచ్‌ఫీల్డ్ ఈ మ్యాచ్‌లో సెంచరీ చేసింది. వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్‌లో శతకం చేసిన అతిపిన్న వయస్సు(22 ఏళ్లు) బ్యాటర్‌గా నిలిచింది.


ఈ వార్తలు కూడా చదవండి..

చాంపియన్‌ను కొట్టేసి ఫైనల్‌ బెర్త్‌ పట్టేసి

మెల్‌బోర్న్‌లో మోతెక్కించేనా

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 31 , 2025 | 12:35 PM