India vs Australia T20 Match: మెల్‌బోర్న్‌లో మోతెక్కించేనా
ABN , Publish Date - Oct 31 , 2025 | 05:21 AM
దు టీ20ల సిరీ్‌సలో ఆరంభ మ్యాచ్ వర్షంతో రద్దయిన వేళ.. శుక్రవారం భారత్-ఆస్ట్రేలియా జట్లు మరో పోరుకు సిద్ధమయ్యాయి. ప్రఖ్యాత మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీసీ)లో జరిగే ఈ రెండో టీ20లో నెగ్గి...
మ. 1.45 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
జోష్‌లో టీమిండియా
ఆసీ్‌సతో రెండో టీ20
మెల్‌బోర్న్: ఐదు టీ20ల సిరీ్‌సలో ఆరంభ మ్యాచ్ వర్షంతో రద్దయిన వేళ.. శుక్రవారం భారత్-ఆస్ట్రేలియా జట్లు మరో పోరుకు సిద్ధమయ్యాయి. ప్రఖ్యాత మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీసీ)లో జరిగే ఈ రెండో టీ20లో నెగ్గి బోణీ చేసేందుకు ఇరుజట్లూ ఎదురుచూస్తున్నాయి. పొట్టి వరల్డ్‌కప్ విజేతగానే కాకుండా ఇటీవలి ఆసియాకప్ టీ20 టోర్నీని గెలిచిన భారత్ బుధవారం నాటి తొలి మ్యాచ్‌ను ఆత్మవిశ్వాసంతో ఆరంభించింది. 9.4 ఓవర్ల ఆటే సాగినా 97/1 స్కోరుతో సరైన ట్రాక్‌లో ఉన్నట్టు కనిపించింది. కెప్టెన్ సూర్యకుమార్ 24 బంతుల్లోనే 39 రన్స్‌తో మునుపటి ఫామ్‌ను అందుకోవడంతో పాటు, హాజెల్‌వుడ్ ఓవర్‌లో ఏకంగా 125మీ. దూరం బాదిన సిక్సర్‌తో ఆసీ్‌సను బెదరగొట్టాడు. అటు ఓపెనర్ గిల్ మాత్రం క్రీజులో కుదురుకున్నాడు. మరో ఓపెనర్ అభిషేక్ కాన్‌బెర్రాలో విఫలమైనా.. ఎంసీజీలో చెలరేగాలనుకుంటున్నాడు. మిడిలార్డర్‌లో తిలక్, శాంసన్, దూబే కీలకం కానున్నారు. మరోవైపు ఐదుగురు బ్యాటర్లు, ముగ్గురు ఆల్‌రౌండర్లు, ముగ్గురు బౌలర్లతో తొలి మ్యాచ్ ఆడిన జట్టు నేటి మ్యాచ్‌లోనూ ఇదే కాంబినేషన్‌ను కొనసాగించవచ్చు. అదే జరిగితే పేసర్ అర్ష్‌దీప్ బెంచీకి పరిమితం కాక తప్పదు. అతనికన్నా హర్షిత్ మెరుగైన బ్యాటర్ కావడంతో కోచ్ గంభీర్ అతడి వైపే మొగ్గుచూపుతున్నాడు. అయితే కుల్దీప్, వరుణ్‌లలో ఒక్కరికే చాన్స్ కల్పిస్తే అర్ష్‌దీ్‌పను తీసుకోవచ్చు.
ఎదురుదాడే లక్ష్యంగా..: భారత్ తరహాలోనే ఆస్ట్రేలియా కూడా ఆరంభం నుంచే ఎదురుదాడికి దిగుతోంది. ఓపెనర్లు హెడ్, మార్ష్ మెరుపు ఆరంభాలతో భారీ స్కోరు అందుకోవాలనుకుంటోంది. ఆ తర్వాత ఇన్‌గ్లి్‌స, డేవిడ్, స్టొయినిస్ బ్యాట్లు ఝుళిపిస్తే భారత బౌలర్లకు కష్టమే. ఇక పేసర్ హాజెల్‌వుడ్‌కు ఈ సిరీ్‌సలో ఇదే చివరి మ్యాచ్. రాబోయే యాషెస్ సిరీస్ కోసం అతడికి విశ్రాంతినివ్వనున్నారు. బార్ట్‌లెట్, ఎలిస్, స్పిన్నర్ కునేమన్ బౌలింగ్‌పై ఆధారపడి ఉంది.
తుది జట్లు (అంచనా)
భారత్: అభిషేక్, గిల్, సూర్యకుమార్ (కెప్టెన్), తిలక్, శాంసన్, దూబే, అక్షర్, హర్షిత్, కుల్దీప్, వరుణ్, బుమ్రా.
ఆసీస్: హెడ్, మార్ష్ (కెప్టెన్), ఇన్‌గ్లి్‌స, డేవిడ్, ఓవెన్, స్టొయినిస్, ఫిలిప్, బార్ట్‌లెట్, ఎలిస్, కునేమన్, హాజెల్‌వుడ్.
పిచ్, వాతావరణం
2022 టీ20 వరల్డ్‌కప్ ఫైనల్ తర్వాత ఎంసీజీలో పొట్టి ఫార్మాట్‌లో జరుగుతున్న మొదటి మ్యాచ్ ఇది. బౌలర్లకు సహకరించే ఈ పిచ్‌పై సగటు స్కోరు 152. అయితే శుక్రవారం కూడా మెరుపులతో కూడిన వాతావరణం ఉండడంతో మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించే అవకాశం ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి..
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్.. రాష్ట్రపతి ఉత్తర్వులు
జగన్‌కు మంత్రి అచ్చెన్నాయుడు చాలెంజ్
Read Latest AP News And Telugu News