Share News

Shefali Verma: కొత్త అధ్యాయం మొదలుపెట్టిన షెఫాలీ వర్మ

ABN , Publish Date - Nov 04 , 2025 | 12:30 PM

ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన చేసిన షెఫాలీ వర్మకు కెప్టెన్సీ రూపంలో కొత్త అధ్యాయం మొదలైంది. సీనియర్ మహిళల ఇంటర్-జోనల్ టీ20 ట్రోఫీలో నార్త్ జోన్ కెప్టెన్‌గా నియమించారు.

Shefali Verma: కొత్త అధ్యాయం మొదలుపెట్టిన షెఫాలీ వర్మ

ఇంటర్నెట్ డెస్క్: షెఫాలీ వర్మ.. క్రికెట్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. అనుకోకుండా జట్టులోకి వచ్చి.. కీలక ఇన్నింగ్స్ ఆడి ప్రపంచ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించింది. ఓపెనర్ ప్రతీకా రావల్ గాయపడటంతో జట్టులో రీఎంట్రీ ఇచ్చి.. సౌతాఫ్రికాతో ఫైనల్‌లో బ్యాట్‌తో 87 పరుగులు చేసి.. రెండు కీలక వికెట్లు తీసింది. ఈ ఆల్‌రౌండ్ షోకు షెఫాలీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. కట్ చేస్తే.. సీనియర్ మహిళల ఇంటర్-జోనల్ టీ20 ట్రోఫీకి ఆమె(Shefali Verma)ను కెప్టెన్‌గా నియమించారు.


కొత్త అధ్యాయం..

ప్రపంచ కప్‌లో అదరగొట్టిన షెఫాలీ వర్మకు కొత్త అధ్యాయం మొదలైందనే చెప్పాలి. సీనియర్ మహిళల ఇంటర్-జోనల్ టీ20 ట్రోఫీ(Women’s Inter-Zonal T20 Trophy)లో నార్త్ జోన్‌కు ఆమెను కెప్టెన్‌గా నియమించారు. ఈ టోర్నీ ఇవాళ (నవంబర్ 4) నుంచి ప్రారంభం కానుంది.


తుది జట్టు ఇదే..

షెఫాలీ కెప్టెన్సీలో ఆరాధనా బిష్త్, బవన్‌దీప్ కౌర్, దియా యాదవ్, హర్లీన్ డియోల్, నజ్మా సుల్తానా, నీనా చౌదరి, శ్వేతా షెరావత్, అమన్‌దీప్ కౌర్, ఆయుషి సోనీ, నీతూ సింగ్, శివాని సింగ్, తాన్యా భాటియా, అనన్య శర్మ, కోమల్ ప్రీత్ కౌర్, మన్నత్ కశ్యప్, మరియా నూరెన్, పరుణికా సిసోడియా, సోనీ యాదవ్, సుమన్ గులియా ఆడనున్నారు.


ఇంటర్ జోన్ టీ20 ట్రోఫీ షెడ్యూల్..

సీనియర్ మహిళల ఇంటర్-జోన్ టీ20 ట్రోఫీలో మొత్తం ఆరు జట్లు పాల్గొంటాయి. సెంట్రల్ జోన్, ఈస్ట్ జోన్, నార్త్ ఈస్ట్ జోన్, నార్త్ జోన్, సౌత్ జోన్, వెస్ట్ జోన్ జట్లు పాల్గొంటాయి. నవంబర్ మంగళవారం ప్రారంభం కానున్న ఈ టోర్నమెంట్ నవంబర్ 14 వరకు కొనసాగుతుంది. అన్ని మ్యాచ్‌లు నాగాలాండ్ క్రికెట్ అసోసియేషన్ (NCA)లో జరుగుతాయి. కాగా షెఫాలీ వర్మ తొలి మ్యాచ్‌లో సౌత్ జోన్‌తో తలపడనుంది.


ఈ వార్తలు కూడా చదవండి:

Laura Wolvaardt: షెఫాలీ బౌలింగ్‌కు షాకయ్యాం: లారా

Shree Charani: ప్రపంచ కప్‌లో కడప బిడ్డ!

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 04 , 2025 | 12:30 PM