Cheteshwar Pujara: క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన పుజారా
ABN , Publish Date - Aug 24 , 2025 | 01:48 PM
భారత సీనియర్ క్రికెటర్ చేతేశ్వర్ పూజారా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు రిటర్మైంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆయన సోషల్ మీడియాలో పోస్ట్‌ను షేర్ చేశారు.
భారత సీనియర్ క్రికెటర్ చేతేశ్వర్ పూజారా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు రిటర్మైంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆయన సోషల్ మీడియాలో పోస్ట్‌ను షేర్ చేశారు. పూజారా 2023 నుంచి జట్టుకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఫామ్‌లోకి వచ్చేందుకు అయితే కొన్ని నెలలుగా అతను చేస్తున్న ప్రయత్నాలు ఫలించలేదు. ఈ నేపథ్యంలో పూజారా క్రికెట్‌కు పూర్తిగా వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
2008లో టీమిండియాలోకి అడుగుపెట్టిన పూజారా (Cheteshwar Pujara).. చివరిసారిగా 2023 జూన్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ (World Test Championship) ఫైనల్‌లో ఇండియా టీమ్ తరఫున ఆడాడు. క్లాసికల్ టెక్నిక్, డిఫెన్స్‌కు పేరు గాంచిన పుజారా.. 15 ఏళ్లకు పైగా టెస్ట్ బ్యాటింగ్ లైనప్‌లో కీలకపాత్ర పోషించాడు. అతడి కెరీర్‌లో ఇప్పటిదాకా 103 టెస్ట్ మ్యాచ్‌లు ఆడగా.. 43.60 సగటుతో మొత్తం 7,195 పరుగులు చేశారు. ఇందులో 19 సెంచరీలు, 35 అర్ధ సెంచరీలు ఉన్నాయి. రాహుల్ ద్రావిడ్ తర్వాత భారత మిడిలార్డర్‌కు వెన్నెముకగా నిలిచిన పూజారా.. అనేక చారిత్రాత్మక భారత విజయాల్లో తనదైన ప్రతిభను కనబరిచాడు.
‘‘రాజ్‌కోట్ అనే చిన్న పట్టణంలోని చిన్న పిల్లవాడిగా, నా తల్లిదండ్రులతో కలిసి, నేను స్టార్లను లక్ష్యంగా చేసుకోవడానికి బయలుదేరాను. భారత క్రికెట్ జట్టులో భాగం కావాలని కలలు కన్నాను. ఈ ఆట నాకు చాలా ఇచ్చింది. అమూల్యమైన అవకాశాలు, అనుభవాలు, ఉద్దేశ్యం, ప్రేమ, అన్నింటికంటే ముఖ్యంగా నా రాష్ట్రాన్ని ఈ గొప్ప దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం ఇచ్చింది. భారత జెర్సీ ధరించడం, భారత గీతం పాడటం నేను మైదానంలోకి అడుగుపెట్టిన ప్రతిసారీ నా వంతు ప్రయత్నం చేయడం - దాని నిజమైన అర్థాన్ని మాటల్లో చెప్పడం అసాధ్యం. కానీ ప్రస్తుతం నేను అపారమైన కృతజ్ఞతతో అన్ని రకాల భారత క్రికెట్ నుంచి రిటైర్ కావాలని నిర్ణయించుకున్నాను’’.. అని పూజారా పేర్కొన్నాడు.
ఇవి కూడా చదవండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..ఎన్ని రోజులు వచ్చాయంటే..
అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి