IND VS AUS: ఆసీస్‌తో రెండో వన్డే.. టీమిండియా తుది జట్టు ఇదే!
ABN , Publish Date - Oct 22 , 2025 | 03:21 PM
రెండో వన్డే కోసం భారత్ తుది జట్టు ఎంపికైనట్లు సమాచారం. తొలి వన్డేలో భారత్ ఇద్దరు స్పిన్ ఆల్ రౌండర్లు, ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగింది. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను బెంచ్‌కే పరిమితం చేసింది.
ఆస్ట్రేలియా పర్యటనలో తొలి వన్డేలో భారత్ ఘోరంగా ఓడిన సంగతి తెలిసిందే. పెర్త్ వేదికగా జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా 7 వికెట్ల తేడాతో టీమిండియాపై విజయం సాధించింది. మూడు వన్డేల సిరీస లో భాగంగా రెండో వన్డే గురువారం ఆడిలైడ్(India vs Australia 2nd ODI) వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్ లో ఆతిథ్య ఆస్ట్రేలియాతో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. ఈ వన్డేలో గెలిస్తే.. సిరీస్‌ను గెలిచే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఓడితే సిరీస్ ఆసీస్ కైవసం కానుంది. దీంతో ఆడిలైడ్ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
రెండో వన్డే కోసం భారత్(Team India) తుది జట్టు ఎంపికైనట్లు సమాచారం. తొలి వన్డేలో భారత్ ఇద్దరు స్పిన్ ఆల్ రౌండర్లు, ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగింది. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను బెంచ్‌కే పరిమితం చేసింది. అయితే తొలి వన్డే ఓటమి తర్వాత జట్టుపై విమర్శలు రావడంతో.. రెండో వన్డేలో(India vs Australia 2nd ODI) కుల్దీప్ యాదవ్ ను ఆడించనున్నట్లు తెలుస్తోంది. బాల్ పాతబడిన తర్వాత స్పిన్నర్లకు అనుకూలిస్తోంది. ఈ క్రమంలోనే భారత్ ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశం కూడా ఉంది. తొలి వన్డేలో విఫలమైన హర్షిత్ రాణాపై వేటు వేసి కుల్దీప్ యాదవ్‌ను ఆడించవచ్చు. ముగ్గురు పేసర్లతో ఆడాలని నిర్ణయిస్తే మాత్రం వాషింగ్టన్ సుందర్(Washington Sundar
)పై వేటు పడుతుంది. టీమిండియా మేనేజ్మెంట్ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
ఆస్ట్రేలియాతో రెండో వన్డేకు భారత తుది జట్టు(అంచనా):
శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ(Virat Kohli), శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(KL Rahul)(కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, మహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా/కుల్దీప్ యాదవ్.
ఇవి కూడా చదవండి..
స్వల్ప తగ్గుదల.. మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకలు.. ప్రధాని మోదీ గురించి ట్రంప్ ఏమన్నారంటే..
మరిన్ని తాజా వార్తలు కోసం క్లిక్ చేయండి..